అన్వేషించండి

AP Kapu Party: కాపు పార్టీ రాబోతోందా... ఈ మీటింగ్ దేనికి సంకేతం....?

ఏపీ రాజకీయాల్లో కొత్త పార్టీ రాబోతోందా ? హైదరాబాద్‌లో జరిగిన అన్ని పార్టీల కాపు నేతల సమావేశంలో జరిగిన చర్చ ఏంటి ? నిర్ణయాత్మకమైన శక్తిగా ఎదగాలని నిర్ణయించుకున్నారా? ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో ఎన్నికల వేడి కనిపిస్తోంది. రాజకీయాలు, వర్గాలు ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో జరిగిన కాపు సామాజికవర్గ నేతల సమావేశంపై అందరి దృష్టి పడింది. ఆ సమావేశంలో ఏం చర్చించారు..?  ఏ ఏ నిర్ణయాలు తీసుకున్నారు ?

హైదరాబాద్‌లో అన్ని పార్టీల కాపు నేతల సీక్రెట్ భేటీ !

హైదరాబాద్‌లో ఇటీవల అన్ని పార్టీలకు చెందిన కాపు నేతలు సమావేశమయ్యారు. ఇది లో ప్రోఫైల్ మీటింగ్. ఏ మీడియాకు సమాచారం లేదు. ఈ సమావేశంలో  టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ, బీజేపీ, జనసేనల్లో ఉన్న ముఖ్యమైన కాపు నేతలందరూ పాల్గొన్నారు. వారి మీటింగ్ అజెండా ఏమిటో వారికి తప్ప ఎవరికీ తెలియదు. వారి సమావేశం ముగిసి వారం రోజులవుతోంది. ఏబీపీ దేశం అత్యంత విశ్వసయంగా అక్కడ జరిగిన సమావేశం వివరాల్ని సేకరించింది. వాటి వివరాలు ఇవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మలుపు తిప్పే కీలక సమావేశాలుగా వాటిని పేర్కొనవచ్చు. 

Also Read: సీఎం జగన్‌ను ఇక బ్రహ్మ కూడా జైలుకి పంపలేడు.. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు

కాపులకు రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలి ?

కాపు సామాజికవర్గం రాజకీయంగా పాలనా స్థానంలోకి రావాలంటే  ఏం  చేయాలన్నది ప్రధానంగా అన్ని పార్టీల్లోని కాపు నేతలు కలిసి మేథోమథనం చేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం రెండు సామాజికవర్గాలే ప్రధానంగా ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటున్నాయి.. ఆ రెండు సామాజికవర్గాల కన్నా ఎక్కువ ఓటు  బ్యాంక్ కాపులకు ఉంది. గెలుపు ఓటముల్ని నిర్దేశిచగలిగే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇప్పటి వరకూ పాలక స్థానానికి చేరుకునే అవకాశం రాలేదు. వచ్చిన ఒకటి ..,రెండు సార్లు మిస్ అయింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ సాధ్యం కాదన్న రీతిలో కాపు నేతలందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో వంగవీటి రాధాకృష్ణ, ముద్రగడ పద్మనాభం, గంటా శ్రీనివాసరావు , కన్నాలక్ష్మినారాయణ, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ సహా కాపు వ్యాపార ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
AP Kapu Party: కాపు పార్టీ రాబోతోందా... ఈ మీటింగ్ దేనికి సంకేతం....?

Also Read: వంగవీటి రాధా ఆఫీసు వద్ద అనుమానాస్పద స్కూటర్ కలకలం ! ఎవరిది అది?

జేడీఎస్ తరహాలో బలం నిరూపించుకుని చాన్స్ సాధించాలా ? 

కాపుల కోసం ప్రత్యేకంగా పార్టీ పెట్టాలనే ఆలోచన వీరి మధ్య సాగినట్లుగా తెలుస్తోంది. అయితే ఒక్క కులానికే  ప్రాధాన్యత ఇచ్చి పార్టీ పెడితే ఇతర వర్గాలు ఏ మాత్రం ఆదరించవని.. అలాంటప్పుడు ఎలా పాలక స్థానం పొందాలన్న అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చింది. ఈ సమయంలో సమావేశంలో పాల్గొన్న కొంత మంది నేతలు కర్ణాటకలోని జేడీఎస్‌ను ఉదహరించినట్లుగా చెబుతున్నారు. ఆ పార్టీ ఓటు బ్యాంక్ అంతా...  దేవేగౌడ సామాజికవర్గానికి చెందినవారే. వారు బలంగాఉన్నచోట పార్టీ అప్రతిహతంగా గెలుస్తూ వస్తోంది. .ఈ క్రమంలో సమీకరణాలు కలసి రావడంతోనే రెండు సార్లు కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. నేరుగా పార్టీ పెట్టడం ద్వారా చిరంజీవి, పవన్ కల్యాణ్ వంటి వారు సక్సెస్ కాలేకపోతున్నందున ఇలా వర్గంగా సమైక్యంగా మారి అనుకున్నది సాధించవచ్చని వీరుభావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
AP Kapu Party: కాపు పార్టీ రాబోతోందా... ఈ మీటింగ్ దేనికి సంకేతం....?

Also Read: పాకిస్తాన్ జాతిపిత పేరుతో గుంటూరులో జిన్నా టవరా .. కూల్చేయాల్సిందే! బీజేపీ డిమాండ్‌తో కలకలం...

ఇప్పటికే ఉన్న జనసేన విషయంలో ఏ వ్యూహం అమలు చేద్దాం ?

అయితే ఇప్పటికే జనసేన పార్టీని కాపు సామాజికవర్గం యువత ఎక్కువగా ఓన్ చేసుకుంటోంది. ఇలాంటి సమయంలో మళ్లీ ప్రత్యేకంగా కాపు పార్టీ అంటే... కాపుల్లోనే విభజన తెచ్చినట్లు కదా అన్న అభిప్రాయం కూడా వారిలో వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే జనసేనను మరింత బలపర్చడాన్ని కూడాఓ ఆప్షన్‌గా పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే జనసేనపార్టీని కాపు సామాజికవర్గంపూర్తి స్థాయిలో నమ్మలేకపోతోందని., గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఆరు శాతం ఉండటమే కారణం అని కొంత మంది విశ్లేషించారు. కానీ వచ్చిన ఓట్లన్నీ కాపులు బలంగా ఉన్న చోటేనని గుర్తుంచుకోవాలని కొంత మంది లెక్కలు చెప్పారు .

Also Read: ఏపీలో 'ఆర్ఆర్ఆర్'కు ఇది ప్లస్సే... మరి, టికెట్ రేట్స్ సంగతి?

కీలక నిర్ణయం అతి త్వరలో !

మొత్తంగా చూస్తే హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో  జనసేనకు సపోర్ట్ చేద్దామా లేక కొత్తపార్టీతోతెరపైకి వద్దామా అన్న దానిపై నిర్ణయం తీసుకున్నారో లేదో స్పష్టత లేదు. ఇప్పటికే జనసేన ప్రజల్లో ఉన్నందున.. ఆ పార్టీకి కొంత ఇమేజ్ ఉన్నందున కొత్తగా మద్దతు ప్రకటించడం వల్ల ఏ లాభమూ ఉండదని.. కాపు నేతలందరూ కలసి కట్టుగా కొత్తపార్టీ పెడితే... కాపు సామాజికవర్గం మొత్తం కలసివస్తుందని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై తదుపరి అడుగులు ఎలా ఉంటాయన్నది ముందు ముందు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Also Read: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్నారా ? ఇదిగో ఈ రూల్స్ అన్నింటినీ గుర్తు పెట్టుకోండి..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Andhra Pradesh News: సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Embed widget