అన్వేషించండి

Karumuri son Sunil arrested by ED: ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం - మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్ - ఈడీ దూకుడు!

Karumuri Sunil Arrest: వైసీపీ నేత కారుమూరి సునీల్ ను ఈడీ అరెస్టు చేసింది. మద్యం స్కాంలో డిస్ట్రిబ్యూషన్ లో భారీ అవినీతికి పాల్పడి ఆ సొమ్మును లాండరింగ్ చేసినట్లుగా ఈడీ గుర్తించింది.

Andhra Pradesh liquor scam case updates:   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. ఏపీ మద్యం స్కాంలో  సుదీర్ఘంగా దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్   అధికారులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పా  సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్‌ను గురువారం అరెస్టు చేశారు. ఇటీవల ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ జరిపిన సోదాల అనంతరం లభించిన కీలక ఆధారాల ప్రాతిపదికన ఈ అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది.

సునీల్ ను అరెస్టు చేసిన ఈడీ 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా జరిగిన మద్యం సరఫరా, డిస్ట్రిబ్యూషన్,  టెండర్ల కేటాయింపుల్లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఈడీ గతేడాది నుంచి విచారణ జరుపుతోంది. ఈ కేసులో కారుమూరి సునీల్ కుమార్ కీలక సూత్రధారిగా ఉన్నారని ఈడీ గుర్తించింది. ఈ అరెస్టుకు ముందు ఈడీ బృందాలు హైదరాబాద్, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్‌కు చెందిన ఇళ్లు, వ్యాపార సంస్థలపై ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఈ సోదాల్లో భారీగా నగదుతో పాటు, డిజిటల్ డివైజ్‌లు, ఇన్వాయిస్‌లు, కొన్ని డమ్మీ కంపెనీలకు  సంబంధించిన బ్యాంకు లావాదేవీల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాలపై సునీల్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం, ఆయన సమాధానాలపై సంతృప్తి చెందకపోవడంతో అధికారులు మనీ లాండరింగ్ నిరోధక చట్టం  కింద అరెస్టును నమోదు చేశారు.

 సునీల్‌పై ఉన్న ప్రధాన అభియోగాలు ఇవే! 

ఈడీ వర్గాల సమాచారం ప్రకారం కారుమూరి సునీల్‌పై ప్రధానంగా మూడు కీలక అభియోగాలు ఉన్నాయి.  మద్యం బ్రాండ్ల అనుమతులు, డిస్టిలరీల నుంచి సప్లై ఆర్డర్ల కేటాయింపుల్లో క్విడ్ ప్రో కో పద్ధతిలో వందల కోట్ల రూపాయల చేతులు మారాయనేది ప్రధాన ఆరోపణ. మద్యం వ్యాపారాల ద్వారా వచ్చిన నల్లధనాన్ని హవాలా మార్గాల్లో ఇతర రాష్ట్రాలకు, విదేశీ పెట్టుబడులకు మళ్లించారనే ఆరోపణలపై ఈడీ గురిపెట్టింది. తండ్రి మంత్రిగా ఉన్న కాలంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి, బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులపై ఒత్తిడి తెచ్చి అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేలా చేశారని ఈడీ భావిస్తోంది.

 రాజకీయ కక్ష సాధింపే అంటున్న వైఎస్సార్‌సీపీ 

కారుమూరి సునీల్ అరెస్టును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కావాలనే ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందని ఆరోపించింది. రాజకీయంగా ఎదుర్కొనలేకే ఇలాంటి అక్రమ కేసులు, అరెస్టులకు తెరతీస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వర్గీయులు మండిపడుతున్నారు. న్యాయస్థానంపై తమకు నమ్మకం ఉందని, చట్టపరంగానే ఈ వేధింపులను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

 ఏపీ రాజకీయాల్లో మరింత హీట్! 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తరహాలోనే ఏపీ మద్యం స్కామ్ కూడా ఇప్పుడు సంచలన మలుపులు తిరుగుతోంది. మాజీ మంత్రి కుమారుడి అరెస్టుతో ఈ కేసులో మరికొందరు కీలక నేతలు, ఉన్నతాధికారుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈడీ అధికారులు సునీల్‌ను కోర్టులో హాజరుపరిచి, తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని కోరనున్నారు.   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu On Medico Priyanka Death: మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget