YS Jagan In AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం, ఛార్జ్‌షీట్లో జగన్ పేరు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసు ఛార్జిషీట్లో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును పలుమార్లు ప్రస్తావించారు.

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో సీట్ అధికారులు 305 పేజీలతో ప్రాథమిక ఛార్జిషీట్ శనివారం సాయంత్రం దాఖలు చేశారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలిసే లిక్కర్స్ కం జరిగిందని సెట్ అధికారులు చాట్ చేసి ఇంట్లో పేర్కొన్నారు. లిక్కర్ స్టాండ్ చార్జిషీట్లో మాజీ సీఎం జగన్ పేరు పలుమార్లు ప్రస్తావించారు. నిందితులంతా జగన్ అత్యంత సన్నిహితులు, పరిచయస్థలేనని పేర్కొన్నారు. అయితే ఈ ప్రాథమిక ఛార్జ్ సీట్లో జగన్ పేరు అందితుడిగా చేర్చలేదు. తాజాగా మరో ఎనిమిది మందిని లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా చేర్చారు.
కొత్త లిక్కర్ పాలసీ విధానం రూపకల్పన, ముడుపుల కోసం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, దాని అమలు, ఈ సొమ్ము ఎలా వసూలు చేశారు, ఎక్కడికి తరలించారు అనే అంశాలను ప్రాథమిక ఛార్జిషీట్లో సిట్ అధికారులు ప్రస్తావించారు. ఈ కేసులో ఇదివరకే 40 మంది వ్యక్తులు, కొన్ని సంస్థలు నిందితులుగా ఉండగా, మరో 8 మందిని లిక్కర్ కేసులో నిందితులుగా చేర్చారు. మొత్తం 16 మందిపై ఈ కేసులో అభియోగాలు ఉన్నాయి. జగన్ కు తెలిసే లిక్కర్ పాలసీ స్కామ్ జరిగిందని ప్రాథమిక ఛార్జ్ షీట్లో పేర్కొనడం చూస్తే.. రెండో ఛార్జిషీట్లో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది.
మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చిన సిట్
1. సైమన్ ప్రసన్
2. కొమ్మారెడ్డి అవినాష్
3. అనిల్ రెడ్డి
4. సుజల్ బెహ్రన్
5. మోహన్
6. రాజీవ్
7. బొల్లారం శివ
8. ముప్పిడి అవినాష్
ప్రీమిలినరీ ఛార్జ్ షీట్ ను సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు. 300 పేజీల పైగా ఛార్జ్ షీట్ లో 100కు పైగా ఫోరెన్సిక్ రిపోర్టులు జత చేశారు. ఇప్పటివరకూ రూ.62 కోట్లు సీజ్ చేసినట్లు ప్రస్తావించారు. 100 కు పైగా ఎలక్ట్రానిక్ పరికరాలు అప్పగించారు. 268 మంది సాక్షుల వివరాలను ఛార్జ్‌షీట్లో సిట్ పొందుపరిచింది. మరో 20 రోజుల్లో రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిట్ చర్యలు చేపట్టింది. రెండో ఛార్జ్ షీట్‌లో ఇంకా ఎవరి పేర్లు చేర్చుతారని చర్చ జరుగుతుంది.
లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గతేడాది ఏపీ సీఐడీలో మద్యం కుంభకోణంపై కేసు నమోదైంది. లిక్కర్ పాలసీ స్కామ్ కేసును దర్యాప్తు చేసేందుకు విజయవాడ నగర పోలీసు కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా పలువుర్ని విచారించిన సిట్ ఏప్రిల్ 22న లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డిని అరెస్టు చేసింది. తర్వాత కేసులో కీలకంగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయరెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న గోవిందప్ప బాలాజీ, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎస్‌పీవై డిస్టిలరీస్ మాజీ డైరెక్టర్ సజ్జల శ్రీధర్‌రెడ్డితో పాటు రాజ్ కెసిరెడ్డి అనుచరులైన పైలా దిలీప్, బూనేటి చాణక్య, అనంతరం చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్నేహితుడు వెంకటేశ్ నాయుడు, పీఏలు బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణలను సిట్ అధికారులు అరెస్టు చేశారు. విచారణకు హాజరైన ఎంపీ మిథున్‌రెడ్డిని శనివారం (జులై 19న) అరెస్టు చేయడంతో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టులు 12కి చేరాయి.






















