అన్వేషించండి

Improvement For Inter 2nd Year: ఇకపై ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్‌ రాసే ఛాన్స్.. ఫీజు కట్టేయండి

AP Inter Second Year Students | ఏపీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ ఏడాది నుంచే ఇంప్రూవ్‌మెంట్ రాసే అవకాశం ప్రభుత్వం కల్పించింది. మే 21 నుండి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయవచ్చు.

AP Advanced Supplementary Exams |అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇప్పటివరకు కేవలం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఇంప్రూవ్‌మెంట్ ఎగ్జామ్ రాసే అవకాశాన్ని, ఇకపై ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు కూడా కల్పిస్తూ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచే ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి పి. రంజిత్ బాషా వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లోని బోర్డుల విధానాలను పరిశీలించిన అనంతరం, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ఈ సప్లిమెంటరీ నుంచే అమలు
మే 21వ తేదీ నుంచి జూన్ 4 వరకు నిర్వహించనున్న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నుంచే ఈ కొత్త నిబంధన అమలు కానుంది. గత నెలలో జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన లేదా ఫెయిల్ అయిన ఇంటర్ సెకండియర్ విద్యార్థులందరూ తమ మార్కులను మెరుగుపరుచుకోవడానికి ఈ Single Attempt అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. విద్యార్థి రాసిన పరీక్షల్లో ఏ ప్రయత్నంలో ఎక్కువ మార్కులు వస్తే, వాటినే తుది ఫలితాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, ప్రాక్టికల్ పరీక్షలకు మాత్రం ఇంప్రూవ్‌మెంట్ రాసే అవకాశం ఉండదని బోర్డు స్పష్టం చేసింది.

పరీక్ష రాయాలనుకున్న విద్యార్థులు ఏప్రిల్ 20 నుంచి 27వ తేదీలోపు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్ మెంట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సాధారణ పరీక్ష ఫీజు రూ. 600తో పాటు, ఇంప్రూవ్‌మెంట్ రాసే ప్రతి సబ్జెక్టుకు అదనంగా రూ. 160 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే వరకు ఎన్నిసార్లైనా పరీక్ష రాసే వీలు కల్పించారు. ఈ నిర్ణయం వల్ల ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులు తమ పర్సంటేజీని పెంచుకోవడానికి మంచి అవకాశం లభించినట్లయిందని చర్చించుకుంటున్నారు.

ఏపీలో ఇంటర్ ఫస్టియర్ లో 77 శాతం విద్యార్థులు పాస్ కాగా, సెకండియర్ లో 81 శాతం పాసయ్యారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రీకౌంటింగ్, రివెరిఫికేషన్ తో పాటు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇటీవల విడుదల చేశారని తెలిసిందే. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

నేపాల్‌-టిబెట్ సరిహద్దుల్లో వరదల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ప్రత్యేక చర్యలు! నేరుగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వాలు!
నేపాల్‌-టిబెట్ సరిహద్దుల్లో వరదల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ప్రత్యేక చర్యలు! నేరుగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వాలు!
Singareni Goldmine: సింగరేణి సిరి.. బంగారు గనుల తవ్వకం చేపట్టనున్న తెలంగాణ
సింగరేణి సింగారం.. మన ఇంటి బంగారం.. గోల్డ్‌ మైన్ తవ్వుతున్న తెలంగాణ
YSRCP North Andhra Leaders: వారసుల కోసం ఉత్తరాంధ్ర వైఎస్ఆర్‌సీపీ నేతల మాస్టర్ ప్లాన్లు - భవిష్య్త ఇచ్చే పార్టీలోకేనా ?
వారసుల కోసం ఉత్తరాంధ్ర వైఎస్ఆర్‌సీపీ నేతల మాస్టర్ ప్లాన్లు - భవిష్య్త ఇచ్చే పార్టీలోకేనా ?
Chilakaluripet Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?

వీడియోలు

CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nepal Floods: నేపాల్ వరదలకు అణు బాంబులాంటి మంచు ముక్కే కారణం! భవిష్యత్‌లో మరిన్ని ఘటనలు!
నేపాల్ వరదలకు అణు బాంబులాంటి మంచు ముక్కే కారణం! భవిష్యత్‌లో మరిన్ని ఘటనలు!
నేపాల్‌-టిబెట్ సరిహద్దుల్లో వరదల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ప్రత్యేక చర్యలు! నేరుగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వాలు!
నేపాల్‌-టిబెట్ సరిహద్దుల్లో వరదల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ప్రత్యేక చర్యలు! నేరుగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వాలు!
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
MS Dhoni CSK Stake: సీఎస్‌కేలో ధోనీకి 25 శాతం వాటా రూమ‌ర్స్ ... ఆకాష్ చోప్రా క్లారిటీ!
సీఎస్‌కేలో ధోనీకి 25 శాతం వాటా రూమ‌ర్స్ ... ఆకాష్ చోప్రా క్లారిటీ!
Dravid-Sehwag Young Cricket Legacy: టీమిండియాలోకి మళ్లీ సెహ్వాగ్- ద్రవిడ్ జంట‌... ఇండియా అండ‌ర్-19 జ‌ట్టులో దిగ్గ‌జ‌ వార‌సుల‌కు చోటు!
టీమిండియాలోకి మళ్లీ సెహ్వాగ్- ద్రవిడ్ జంట‌... ఇండియా అండ‌ర్-19 జ‌ట్టులో దిగ్గ‌జ‌ వార‌సుల‌కు చోటు!
Facial Swelling : ముఖం, కళ్ల చుట్టూ వాపుగా కనిపిస్తుందా? తాత్కాలిక ఉపశమనం కోసం ఈ చిట్కాలు ట్రై చేయండి
ముఖం, కళ్ల చుట్టూ వాపుగా కనిపిస్తుందా? తాత్కాలిక ఉపశమనం కోసం ఈ చిట్కాలు ట్రై చేయండి

Embed widget