అన్వేషించండి

AP Inter 2nd Year Results 2026: ఏపీ ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి, డైరెక్ట్ లింక్స్

AP Inter 2nd Year Results 2026 Manabadi: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. https://resultsbie.ap.gov.in/ లో చెక్ చేసుకోవాలి.

AP Inter 2nd Year Results 2026 | ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేశాయ్. తాడేపల్లిలోని బోర్డు కార్యాలయంలో బుధవారం ఉదయం ఇంటర్మీడియట్‌ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్  https://resultsbie.ap.gov.in/ లో ఫలితాలు చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.  ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్‌ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించింది.

ఈ ఏడాది ఇంటర్‌  పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య గత కొన్నేళ్లతో పోల్చితే పెరిగింది. మొత్తం 10, 57, 899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులు  5, 26, 264 మంది ఉన్నారు. ఈ మొత్తంలో జనరల్‌ స్ట్రీమ్‌, ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులు కూడా  ఉన్నారు. 

సెకండియర్‌లోనూ బాలికలదే పైచేయి..

ఏపీ ఇంటర్ సెకండియల్ 505609 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, జనరల్ విభాగంలో 446537 మంది, వొకేషనల్ విభాగంలో 33852 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో  జనరల్ విభాగంలో బాలికలు 85 శాతం, బాలురు 76 శాతం పాసయ్యారు. వొకేషనల్ విభాగంలో బాలికలు 83 శాతం, బాలురు 62 శాతం మంది పాసయ్యారు.

మీరు ఫోన్‌ నుంచి 9552300009 నెంబర్‌ కు వాట్సాప్ లో హాయ్ అని మెస్సేజ్ చేసి రిజల్ట్స్ చేక్ చేసుకోవచ్చు. Hi అని మెస్సేజ్ తరువాత వచ్చే సూచనల ప్రకారం మీ హాల్‌టికెట్ నెంబర్, ఇతర వివరాలు ఎంటర్ చేస్తే సెకన్‌లలో ఫలితాలు మీ ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు - జిల్లా వారీగా

  జిల్లా హాజరైన వారు ఉత్తీర్ణులైన వారు పాస్ శాతం (%)
1 కృష్ణా 21,669 19,952 92
2 గుంటూరు 30,551 26,856 88
3 ఎన్టీఆర్ 36,151 31,453 87
4 పార్వతీపురం మన్యం 5,879 5,097 87
5 అల్లూరి సీతారామరాజు 5,370 4,603 86
6 తూర్పు గోదావరి 18,337 15,707 86
7 విశాఖపట్నం 37,422 32,034 86
8 కర్నూలు 18,899 16,077 85
9 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 24,141 19,771 82
10 ఏలూరు 14,036 11,298 80
11 తిరుపతి 27,790 22,344 80
12 పశ్చిమ గోదావరి 15,557 12,414 80
13 అనకాపల్లి 9,926 7,829 79
14 పల్నాడు 14,381 11,114 77
15 అనంతపురము 20,320 15,530 76
16 డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ 9,541 7,258 76
17 ప్రకాశం 16,842 12,787 76
18 విజయనగరం 16,456 12,456 76
19 నంద్యాల 12,300 9,306 76
20 కాకినాడ 17,963 13,485 75
21 బాపట్ల 8,358 6,252 75
22 శ్రీ సత్యసాయి 9,914 7,378 74
23 శ్రీకాకుళం 17,355 12,684 73
24 చిత్తూరు 11,651 8,280 71
25 వైఎస్ఆర్ కడప 13,896 9,870 71
26 అన్నమయ్య 11,832 7,981 67
మొత్తం TOTAL 4,46,537 3,59,816 81

అత్యధిక ఉత్తీర్ణత సాధించిన మొదటి 5 జిల్లాలు

రాష్ట్రవ్యాప్త ఫలితాలలో కృష్ణా జిల్లా 92 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గుంటూరు (88 శాతం), ఎన్టీఆర్ జిల్లా (87 శాతం) నిలిచాయి. గిరిజన ప్రాంతాలైన పార్వతీపురం మన్యం (87 శాతం), అల్లూరి సీతారామరాజు (86 శాతం) జిల్లాలు కూడా అద్భుత ప్రతిభ కనబరిచి మొదటి ఐదు స్థానాల్లో నిలవడం విశేషం.

అల్ప ఉత్తీర్ణత నమోదైన చివరి 5 జిల్లాలు

ఈ ఫలితాలలో అన్నమయ్య జిల్లా 67 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. దీనికంటే కొంచెం మెరుగ్గా వైఎస్ఆర్ కడప మరియు చిత్తూరు జిల్లాలు చెరో 71 శాతంతో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా 73 శాతం ఉత్తీర్ణత సాధించగా, శ్రీ సత్యసాయి జిల్లా 74 శాతంతో తర్వాతి స్థానంలో ఉంది. ఈ జిల్లాలు రాష్ట్ర సగటు ఉత్తీర్ణత (81 శాతం) కంటే తక్కువ ఫలితాలను నమోదు చేశాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget