అన్వేషించండి

AP Inter 1st Year Results 2026: ఏపీ ఇంటర్ ఫస్టియర్‌లో 77 శాతం పాస్.. రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్స్

AP Inter 1st Year Results 2026 Manabadi:

AP Inter 1st Year Results 2026 | అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం ఉదయం ఇంటర్మీడియట్‌ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 77 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అధికారిక వెబ్‌సైట్  https://resultsbie.ap.gov.in/ లో ఫలితాలు చెక్ చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్‌ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించారు.

ఈ ఏడాది ఇంటర్‌  పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య గత కొన్నేళ్లతో పోల్చితే పెరిగింది. మొత్తం 10, 57, 899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 5, 31, 275 మంది ఉన్నారు. జనరల్‌ విభాగంలో, ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులు ఇద్దరూ ఉన్నారు. 

నేరుగా మీ వాట్సాప్‌లో ఫలితాలు
మీ ఫోన్‌లో 9552300009 నెంబర్‌ కు వాట్సాప్ లో హాయ్ అని మెస్సేజ్ చేసి రిజల్ట్స్ చేక్ చేసుకోవచ్చు. Hi అని మెస్సేజ్ తరువాత వచ్చే సూచనలు పాటిస్తూ మీ హాల్‌టికెట్ నెంబర్, వివరాలు ఎంటర్ చేస్తే సెకన్‌లలో ఫలితాలు మీ ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.

ఏపీ ఇంటర్ ఫస్టియర్ లో 510307 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, జనరల్ విభాగంలో 361526 మంది, వొకేషనల్ విభాగంలో 23569 మంది పాసయ్యారు. ఫస్టియర్‌లో జనరల్ విభాగంలో బాలికలు 81 శాతం, బాలురు 72 శాతం పాసయ్యారు. వొకేషనల్ విభాగంలో బాలికలు 71 శాతం, బాలురు 49 శాతం పాసయ్యారు. 

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు - జిల్లా వారీగా

  జిల్లా హాజరు పాసైన వారు

పాస్ శాతం (%)

1 కృష్ణా 22,403 20,142 90
2 గుంటూరు 33,643 29,530 88
3 విశాఖపట్నం 37,891 32,334 85
4 ఎన్టీఆర్ 34,510 29,103 84
5 పార్వతీపురం మన్యం 5,713 4,759 83
6 తూర్పు గోదావరి 19,977 16,439 82
7 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 25,147 19,682 78
8 తిరుపతి 28,383 22,016 78
9 అల్లూరి సీతారామరాజు 5,653 4,368 77
10 పశ్చిమ గోదావరి 16,701 12,775 76
11 ఏలూరు 14,621 11,133 76
12 అనకాపల్లి 10,315 7,602 74
13 పల్నాడు 15,945 11,622 73
14 కర్నూలు 22,474 16,356 73
15 అనంతపురము 21,730 15,814 73
16 విజయనగరం 16,984 12,268 72
17 బాపట్ల 8,831 6,361 72
18 డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ 10,527 7,580 72
19 ప్రకాశం 19,254 13,520 70
20 శ్రీ సత్యసాయి 9,959 6,969 70
21 శ్రీకాకుళం 17,432 12,163 70
22 చిత్తూరు 12,567 8,691 69
23 కాకినాడ 19,434 13,156 68
24 వైఎస్ఆర్ కడప 15,286 10,150 66
25 నంద్యాల 13,598 9,024 66
26 అన్నమయ్య 12,886 7,969 62
మొత్తం TOTAL 4,71,864 3,61,526 77

అత్యధిక ఉత్తీర్ణత సాధించిన టాప్ 5 జిల్లాలు

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా 90 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గుంటూరు (88 శాతం), విశాఖపట్నం (85 శాతం) జిల్లాలు నిలిచాయి. ఎన్టీఆర్ జిల్లా 84 శాతంతో నాలుగో స్థానంలో ఉండగా, పార్వతీపురం మన్యం జిల్లా 83 శాతంతో ఐదో స్థానంలో నిలిచింది. 

అల్ప ఉత్తీర్ణత నమోదైన చివరి 5 జిల్లాలు

అన్నమయ్య జిల్లా 62 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలు చెరో 66 శాతంతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచాయి. కాకినాడ జిల్లాలో 68 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, చిత్తూరు జిల్లా 69 శాతంతో చివరి నుండి ఐదో స్థానంలో ఉంది. ఈ జిల్లాలు రాష్ట్ర సగటు ఉత్తీర్ణత అయిన 77 శాతం కంటే తక్కువ ఫలితాలు సాధించాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget