అన్వేషించండి

AP Inter Results 2026: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి.. 2 రకాలుగా ఫలితాలు తెలుసుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ మంత్రి నారా లోకేష్ బుధవారం ఉదయం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ ఇంటర్ పరీక్షలు వెల్లడించి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించింది. విద్యార్థులు ఫలితాల్ని అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in/ లో చెక్ చేసుకోవాలని సూచించారు.

ఈ ఏడాది ఏపీలో ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య గత కొన్ని ఏళ్లతో పోలిస్తే పెరిగింది. మొత్తం 10,57,899 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కాగా, వీరిలో ఫస్టియర్  విద్యార్థులు 5,31,275 మంది ఉండగా, రెండో సంవత్సరానికి చెందిన విద్యార్థులు 5,06,264 మంది ఉన్నారు. జనరల్ స్ట్రీమ్, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు కూడా ఇందులో ఉన్నారు. ఈ ఏడాది పరీక్షల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా హాజరుశాతం భారీగా నమోదయ్యింది.

అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు

ఏపీలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫలితాలు విడుదలైన వెంటనే వెబ్‌సైట్‌లపై ఒత్తిడి పెరిగి అవి మొరాయించే అవకాశం ఉందని, ఫలితాలు చెక్ చేసుకునేందుకు విద్యార్థుల కోసం రెండు ప్రధాన మార్గాలను బోర్డు సూచించింది. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in/ లో హాల్‌టికెట్ నంబర్, బర్త్ డే వివరాలను నమోదు చేయడం ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు. వాట్సాప్ మనమిత్ర ద్వారా సైతం విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకుని తమ స్కోర్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్‌లు స్క్రీన్‌పై కనిపించగా, భవిష్యత్ అవసరాల కోసం మార్క్స్ మెమోను డౌన్‌లోడ్ చేసుకునే వీలు కల్పించారు.

వాట్సాప్ ద్వారా ఏపీ ఇంటర్ ఫలితాలు
అధికారిక వెబ్‌సైట్ కాకుండా మన మిత్ర అనే వాట్సాప్ సేవను ఉపయోగించి కూడా ఏపీ ఇంటర్ ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం విద్యార్థులు 9552300009 నెంబర్‌కు వాట్సాప్‌లో Hi అని మెసేజ్ పంపి, అందులో వచ్చే సూచనల ప్రకారం హాల్‌టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా సెకన్లలో ఫలితాలను విద్యార్థుల ఫోన్ స్క్రీన్‌పైకి వచ్చేలా ఇంటర్ బోర్డ్, విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget