By: ABP Desam | Updated at : 19 Jan 2022 06:49 PM (IST)
21న సీఎస్‌కు సమ్మె నోటీసు ఇవ్వనున్న ఉద్యోగ సంఘాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఐఆర్ కన్నా ఫిట్‌మెంట్ తగ్గించడం, హెచ్‌ఆర్‌ఏనూ కోత పెట్టడం, ఫిట్‌మెంట్ కన్నా ఎక్కువగా ఇచ్చిన ఐఆర్‌ను రికవరీ చేయాలని ఆదేశించడం.. డీఏలన్నీ కోత పడిన జీతానికి సరి పెట్టడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నాయి. ఆరేడు డీఏలు కలిసినా పీఆర్సీ వల్ల ఒక్క రూపాయి జీతం పెరగకపోగా హెచ్‌ఆర్‌ఏ భారీగా తగ్గిపోవడంతో .. జీతంలో కోత పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో ఉద్యోగ సంఘ నేతలపై ఒత్తిడి పెరిగింది.
Also Read: కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది.. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు
మధ్యాహ్నం ప్రెస్‌మీట్ పెట్టిన చీఫ్ సెక్రటరీ ఇక ఎలాంటి మార్పులు చేసేది లేదని ప్రభుత్వానికి ఆర్థికంగా వెసులుబాటు లేదని తేల్చేశారు. అంతే కాకుండా ప్రభుత్వం చాలా ఎక్కువగా ఉద్యోగులపై ఖర్చు పెడుతోందన్నారు. ఈ సమాచారంతో ఉద్యోగులు మరితం ఆగ్రహానికి గురవుతున్నారు. ప్రతి ఒక్క ఉద్యోగికి రూ.6 నుంచి 7వేల వరకు జేబుకు చిల్లు పడే పరిస్థితి ఉందని ఎపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త పీఆర్‌సీ వద్దు.. డీఏలతో కూడిన 27శాతం ఐఆర్ ఇస్తున్న పాత జీతమే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యోగుల భవిష్యత్తును తాకట్టుపెట్టేందుకు తాము సిద్ధంగా లేమని... సమ్మెకు దిగాలని నిర్ణయించాయని బండి శ్రీనివాసరావు ప్రకటించారు. 21న సీఎస్‌కు సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగుల ఆశలను వమ్ము చేయమన్నారు. జీవోలను వెనక్కి తీసుకునే వరకు ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని ఉద్యోగ సంఘం నేతలు ఇప్పటికే ప్రకటించారు.
Also Read: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు
ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. సమ్మె చేసి ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తే ప్రత్యామ్నాయ చర్యలకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అన్ని పనులు చేయడానికి రెడీగా ఉన్నారు. వారు కూడా సమ్మెలోకి వెళ్తే వాలంటీర్లు రెడీగా ఉన్నారు. ఇంకా కావాలంటే తాత్కాలిక నియామకులు జరుపుకుని ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించాలనే ఆలోచన చేసే అవకాశం ఉంది. గతంలో సమ్మె చేస్తున్న ఉద్యోగుల్ని ఒక్క కలం పోటుతో డిస్మిస్ చేసి.. తమిళనాడు సీఎం జయలలిత సంచలనం సృష్టించారు. ఆ తరహా పరస్థితులు ఏర్పడతాయేమోనన్న చర్చ ప్రారంభమైంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు
Nara Lokesh : రేపు విజయవాడ కోర్టుకు నారా లోకేశ్, ఆ కేసులోనే!
Breaking News Live Updates: కర్నూలు జిల్లాలో విషాదం, పెళ్లి మండపంలో వరుడు హఠాన్మరణం
JC Prabhakar Reddy : మంత్రుల బస్సు యాత్రపై రాళ్లు పడే అవకాశం, జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Chandrababu : ఎమ్మెల్సీ అనంతబాబు పెళ్లిళ్లు, పేరంటాలకు తిరుగుతున్నా అరెస్టు చేయడంలేదు, చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!
IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!