AP Students: మణిపూర్ నుంచి విద్యార్ధులను రప్పించేందుకు 2 స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి మణిపూర్ లో ఉన్న రాష్ట్రానికి చెందిన విద్యార్థులను క్షేమంగా తరలించనున్నారు.
అమరావతి: మణిపూర్ విద్యార్ధుల విషయంలో ఫలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయత్నాలు ఫలించాయి. రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి మణిపూర్ లో ఉన్న రాష్ట్రానికి చెందిన విద్యార్థులను క్షేమంగా తరలించనున్నారు. ఏపీ ప్రభుత్వం సొంత ఖర్చులతో రెండు విమానాలు ఏర్పాటు చేసింది. ఇంఫాల్ నుంచి ఒక విమానం హైదరాబాద్‌కు, మరోక విమానం కోల్‌కత్తాకు, అక్కడినుంచి స్వస్థాలాలకు పంపేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సోమవారం ఉదయం 9.35 గంటలకు హైదరాబాద్ బయలుదేరనున్న విమానం, అందులో 108 మంది ఏపీ విద్యార్ధులు ప్రయాణించనున్నారు. అయితే విద్యార్థుల విషయంలో ఆందోళన అక్కర్లేదని ఏపీ ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించింది.
IMF HYD 0935/1235
108 Andhra Pradesh
సోమవారం ఉదయం 11.10 గంటలకు కోల్‌కత్తా బయలుదేరనున్న విమానం, అందులో 49 మంది ఏపీ విద్యార్ధులు ప్రయాణించనున్నారని ఏపీ అధికారులు తెలిపారు.
IMF CCU 1110/1220
49 Andhra Pradesh Total 157
ఏపీ విద్యార్థులను క్షేమంగా తీసుకొస్తాం, హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే - మంత్రి బొత్స
మణిపూర్ రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్న క్రమంలో, అక్కడ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులను గుర్తించి, వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకువస్తామని రాష్ట్ర విద్యాశాఖామత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటివరకు సుమారు వంద మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఇంకా ఎవరైనా ఉంటే , రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ను సంప్రదించాలని మంత్రి బొత్స సూచించారు. ఏపీ భవన్ లోని అధికారులు +91 8800925668, +91 9871999055 నంబర్లను కాంటాక్టు చేయాలన్నారు.
విజయనగరంలోని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి బొత్స మాట్లాడుతూ.. మణిపూర్ లో ఉన్న ఏపీకి చెందిన విద్యార్థుల సమస్యను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లామని, అక్కడ చదువుతున్న విద్యార్థుల జాబితాను రూపొందించామని, వారికి అన్ని విధాలా అండగా ఉంటాంమని హామీ ఇచ్చారు. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రితో కూడా మాట్లాడినట్లు తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని కోరారు. ఇంకా 50 మంది వరకు ఉండచ్చు నని అంచనా వేస్తున్నామని, 150 మందికి సరిపడ్డ విమానం ఏర్పాటు చేశామని తెలిపారు. ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు
సహాయాన్ని అందించడానికి మణిపూర్ ప్రభుత్వం, స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. మణిపూర్ రాష్ట్రంలోని ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నవారికి సహాయం అందించడానికి మణిపూర్ లో ఈ హెల్ప్‌లైన్ నంబర్‌లను ఏర్పాటుచేశారు.
1. 8399882392 - ఎంఎన్ మైఖేల్ అకోమ్, IRS
2. 9436034077 - రెహనుద్దీన్ చౌదరి, జాయింట్ సెక్రటరీ (హోమ్)
3. 7005257760 - పీటర్ సలాం, జాయింట్ సెక్రటరీ (హోమ్)
4. 8794475406 - డాక్టర్ టీహెచ్. చరణ్‌జీత్ సింగ్, జాయింట్ సెక్రటరీ (హోం)
5. 8730931414 - డా. మయెంగ్‌బామ్ వీటో సింగ్, డిప్యూటీ సెక్రటరీ (హోమ్)
6. 7085517602 - ఎస్. రుద్రనారాయణ సింగ్, డీఎస్పీ (హోమ్)
మణిపూర్‌లో తమ పిల్లలు, విద్యార్థులు ఉన్నట్లయితే వారి తల్లిదండ్రులు న్యూ ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్‌లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అదే విధంగా మణిపూర్ లో ఉన్న తమ పిల్లలకు సహాయం గురించి కోరవచ్చు అని ఓ ప్రకటనలో తెలిపారు. ఇంఫాల్‌లో, లేక న్యూఢిల్లీలో AP భవన్ హెల్ప్‌లైన్ ద్వారా సంప్రదించి, వారికి అవసరమైన ఏదైనా సహాయం కోరాల్సిందిగా విద్యార్థులకు సూచించారు.