By: ABP Desam | Updated at : 12 Nov 2021 04:33 PM (IST)
సజ్జలతో ఏపీ ఉద్యోగ సంఘాలు (ఫైల్ ఫోటో )
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పే రివిజన్ కమిషన్ నివేదికును ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించలేదు. శుక్రవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. 13 ఉద్యోగ సంఘాల నేతలను ఆహ్వానించారు. అయితే సమావేశం ప్రారంభమైన కాసేపటికే పది ఉద్యోగ సంఘాల నేతలు బయటకు వచ్చేశారు. సమావేశంలో ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం అవమానించిందని .. పీఆర్సీ నివేదిక ఇవ్వడానికి సిద్ధం గా లేదని వారు ఆరోపించారు. బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Also Read : ఏపీ సీఎం జగన్ కాలుకు గాయం.. మణిపాల్ ఆస్పత్రిలో రెండు గంటల పాటు చికిత్స !
పే రివిజన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి మూడేళ్లు అవుతోందని అయినా ఇంత వరకూ బహిర్గతం చేయలేదని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. ఇప్పటికి మూడు సార్లు తిప్పించుకుని అవమానించారన్నారు. గత నెలాఖరులోనే పీఆర్సీ ప్రకటిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారని కానీ మాట తప్పారని ఏపీజేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. పీఆర్సీ కోసం లక్షలాది మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని .. ప్రభుత్వం మంచి చేస్తుందని మూడేళ్లుగా ప్రభుత్వానికి సహకరిస్తూ వచ్చామన్నారు. ఇక నుంచి ఉద్యోగులు సహనంతో ఉండే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఇక ఉపేక్షించేది లేదని ఉద్యమ బాట పడతామని వారు ప్రకటించారు. జిల్లా కమిటీలతో చర్చించి ఎలాంటి పోరాట కార్యాచరణ ప్రకటించాలో నిర్ణయించుకుంటామని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రకటించారు.
Also Read : రూ. 25వేల కోట్ల బకాయిలు డిస్కంలకు చెల్లించండి.. ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ లేఖ !
మొత్తం 13 సంఘాలకు గుర్తింపు ఉండటంతో 10 సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బయటకు వచ్చాయి. అయితే మూడు సంఘాలు మాత్రం ప్రభుత్వంవైపే ఉన్నాయి. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఆయన ఇతర ఉద్యోగ సంఘాలపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల మధ్య చీలిక వచ్చినట్లుగా భావిస్తున్నారు.
ఒక్క పీఆర్సీపై ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నేతలు పట్టుబడుతున్నప్పటికీ ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. చివరికి ఉద్యోగుల జీపీఎఫ్ నిధులను కూడా ప్రభుత్వం వాడుకుందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలాగే ఇన్సూరెన్స్ సొమ్ము, రిటైరైన తర్వాత ఇవ్వాల్సిన బెనిఫిట్స్ సహా అనేక పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరించాల్సి ఉంది. ప్రభుత్వం స్పందించడానికి సిద్ధంగా లేకపోవడంతో ఉద్యోగులు కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉద్యోగులు సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్నారు.
Also Read : పంచ్ ప్రభాకర్ కోసం ఇంటర్‌పోల్ బ్లూ నోటీస్ ! ఆచూకీ తెలిసిన వెంటనే అరెస్ట్ ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు
Nara Lokesh : రేపు విజయవాడ కోర్టుకు నారా లోకేశ్, ఆ కేసులోనే!
Breaking News Live Updates: కర్నూలు జిల్లాలో విషాదం, పెళ్లి మండపంలో వరుడు హఠాన్మరణం
JC Prabhakar Reddy : మంత్రుల బస్సు యాత్రపై రాళ్లు పడే అవకాశం, జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Chandrababu : ఎమ్మెల్సీ అనంతబాబు పెళ్లిళ్లు, పేరంటాలకు తిరుగుతున్నా అరెస్టు చేయడంలేదు, చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా