CM Jagan : ఏపీ సీఎం జగన్ కాలుకు గాయం.. మణిపాల్ ఆస్పత్రిలో రెండు గంటల పాటు చికిత్స !

ఏపీ సీఎం జగన్ కుడి కాలుకు స్వల్ప గాయం అయింది. తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాలుకు గాయం అయింది. గాయం వల్ల నొప్పి ఎక్కువగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో ఆయన కు రెండు గంటల పాటు చికిత్స జరిగినట్లుగా తెలుస్తోంది. గాయం ఎలా అయిందన్నదానిపై స్పష్టత లేదు. కానీ కుడి కాలు నొప్పి వల్ల నడవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండటంతో ఆస్పత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 

Also Read : రూ. 25వేల కోట్ల బకాయిలు డిస్కంలకు చెల్లించండి.. ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ లేఖ !

ఇంటి వద్ద ప్రాథమిక చికిత్స చేయించుకున్నా ఆస్పత్రికి వెళ్లాలని వ్యక్తిగత వైద్యులు సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయన తాడేపల్లిలోని క్యాంపాఫీస్‌కు సమీపంలోనే ఉన్న మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఫిజియోధెరపీతో పాటు ఇతర వైద్యులు కూడా పరిశీలించి చికిత్స చేసినట్లుగా తెలుస్తోంది. రెండు గంటల తర్వాత ఉపశమనం అనిపించడంతో ఆయన మళ్లీ క్యాంపాఫీస్‌కు చేరుకున్నారు. యథావిధిగా రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జగన్‌కు గాయం గురించి అధికారవర్గాలు గోప్యంగా ఉంచాయి. 

Also Read : శాసనమండలిలో వైఎస్ఆర్‌సీపీకి పూర్తి మెజార్టీ ! ఇక "రద్దు తీర్మానాన్ని" ఉపసంహరించుకుంటారా ?

అభిమానులు ఆందోళన చెందే అవకాశం ఉండటం.. గాయం చిన్నదే కావడంతో  బహిరంగ ప్రకటన చేయలేదని తెలుస్తోంది. ఆస్పత్రికి జగన్ వెళ్లే సరికి .. ఎవరినో పరామర్శించడానికి వెళ్లారని అనుకున్నారు. కానీ ఆయనే కాలికి వైద్యం కోసం వచ్చినట్లుగా ఆలస్యంగా బయటకు తెలిసింది. జగన్‌కు గాయం ఎలా అయింది.. ఎలాంటి ట్రీట్ మెంట్ చేశారన్నదానిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

Also Read : బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ భారీగా జరిగింది.. అభ్యర్థులు కోర్టుకు వెళ్తే వాళ్లు జైలుకే

జగన్‌ కాలుకు ఇబ్బంది రావడం ఇటీవలి కాలంలో ఇది రెండో సారి. గతంలోనూ ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనాల్సి ఉండగా.. జిమ్‌లో కాలు  బెణకడంతో ఆయన సమావశానికి వెళ్లలేకపోయారు. మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స తర్వాత జగన్ కాలు నొప్పి తగ్గిపోయినట్లేనని  వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.  ఈ కారణంగా ఎలాంటి అధికారిక కార్యక్రమాలు వాయిదా వేసే అవకాశం లేదని తెలుస్తోంది.

Also Read : పంచ్ ప్రభాకర్‌ కోసం ఇంటర్‌పోల్ బ్లూ నోటీస్ ! ఆచూకీ తెలిసిన వెంటనే అరెస్ట్ ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 12 Nov 2021 02:18 PM (IST) Tags: ANDHRA PRADESH cm jagan Jagan injured Tadepalli Manipal Hospital

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: రాజ్యసభకు నామినేట్ అయిన ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్, పీటీ ఉష

Breaking News Live Telugu Updates: రాజ్యసభకు నామినేట్ అయిన ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్, పీటీ ఉష

APL 2022: మొదలైన ఆంధ్రా ప్రీమియర్ లీగ్ - మొదటి విజయం గోదావరిదే!

APL 2022: మొదలైన ఆంధ్రా ప్రీమియర్ లీగ్ - మొదటి విజయం గోదావరిదే!

Anna Canteen In Nellore: చంద్రబాబు సీఎం అయ్యేవరకు తగ్గేదేలే- నెల్లూరు జిల్లా నేతల నిర్ణయం

Anna Canteen In Nellore: చంద్రబాబు సీఎం అయ్యేవరకు తగ్గేదేలే- నెల్లూరు జిల్లా నేతల నిర్ణయం

House committee On Pegasus: పెగాసెస్‌పై ముగిసిన హౌస్ క‌మిటి భేటీ- ఈనెల‌లోనే స‌భ ముందుకు నివేదిక‌

House committee On Pegasus: పెగాసెస్‌పై ముగిసిన హౌస్ క‌మిటి భేటీ- ఈనెల‌లోనే స‌భ ముందుకు నివేదిక‌

Nellore Drainage Problems: వామ్మో! ఏంటీ ప్లాస్టిక్ వ్యర్థాలు- షాకైన కమిషనర్

Nellore Drainage Problems: వామ్మో! ఏంటీ ప్లాస్టిక్ వ్యర్థాలు- షాకైన కమిషనర్

టాప్ స్టోరీస్

Cooking Oil Prices: గుడ్‌ న్యూస్‌! భారీగా తగ్గనున్న వంట నూనెలు, పప్పుల ధరలు!

Cooking Oil Prices: గుడ్‌ న్యూస్‌! భారీగా తగ్గనున్న వంట నూనెలు, పప్పుల ధరలు!

India vs WI: టీమిండియాకు మరో కొత్త కెప్టెన్ - ఈసారి చాన్స్ ఎవరికంటే?

India vs WI: టీమిండియాకు మరో కొత్త కెప్టెన్ - ఈసారి చాన్స్ ఎవరికంటే?

Naga Chaitanya: చైతు ఎమోషనల్ థాంక్యూ నోట్ - అందులో సమంత హ్యాష్ కూడా!

Naga Chaitanya: చైతు ఎమోషనల్ థాంక్యూ నోట్ - అందులో సమంత హ్యాష్ కూడా!

Gautham Raju death: గౌతమ్ రాజు మరణం - ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎమోషనల్ ట్వీట్స్

Gautham Raju death: గౌతమ్ రాజు మరణం - ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎమోషనల్ ట్వీట్స్