అన్వేషించండి

Pawan Kalyan: 'ఆ మొక్కలు పెంచొద్దు' - వన మహోత్సవంలో పాల్గొనాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపు

Andhra News: రాష్ట్రంలో కోనోకార్పస్ మొక్కలు పెంచడం మానేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. దేశీయ మొక్కలనే ఎక్కువగా పెంచాలని అన్నారు.

AP Deputy CM Pawan Kalyan Comments In Vana Mahotsavam: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతోన్న వన మహోత్సవం (Vana Mahotsavam) ఓ సామాజిక బాధ్యత అని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కళకళలాడాలని అన్నారు. 'దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు. అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దాం. అరబ్ దేశాలే కోనో కార్పస్ మొక్కలను వద్దనుకున్నాయి. పచ్చదనం కోసం ఆ జాతి మొక్కలు అక్కడ విరివిగా పెంచారు. అనంతరం ఆ మొక్కల వల్ల జరిగే దుష్ప్రభావాన్ని అర్థం చేసుకుని ఈ మొక్కను వద్దనుకుని నిషేధించాయి. దీని వల్ల జరిగే అనర్ధాలు అధికం. భూగర్భ జల సంపదను ఎక్కువగా వినియోగించుకోవడం సహా చుట్టుపక్కల ఉన్న వారికి శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి. కోనో కార్పస్ మొక్కను పశువులు తినవు. పక్షులు గూడు పెట్టుకోవు. చెట్లను ఆశ్రయించే క్రిమి కీటకాలు రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కలను మనం పెంచడం సరికాదు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఈ మొక్కను పెంచడం మానేయాలి. మన దేశంలో తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, అస్సాం ప్రభుత్వాలు సైతం కోనోకార్పస్‌ను నిషేధించాయి. అందరికీ మేలు చేసే మొక్కలే మన నేస్తాలు.' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

'జీవోఐఆర్ పునరుద్ధరణ'

పారదర్శక పాలనకు సాక్ష్యంగా జీఓఐఆర్ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించామని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో.. ఏ ఉత్తర్వులు వెలువడుతున్నాయో అనేది తెలుసుకోవడం ప్రజల హక్కు అని గురువారం ట్విట్టర్ వేదికగా చెప్పారు. 'ప్రభుత్వ శాఖలు ఏ ఉత్తర్వులు ఇస్తున్నాయో ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. గత పాలకులు వాటిని గోప్యంగా ఉంచి ప్రజలకు సమాచారం అనేదే లేకుండా చేశారు. కానీ, మా ప్రభుత్వం అలాంటి నియంతృత్వ పోకడలను తోసిపుచ్చుతోంది. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తుందని చెప్పడానికి ఈ వెబ్ సైట్ పనురద్ధరణే ఓ ఉదాహరణ.' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read: YSRCP Sajjala : సజ్జల రామకృష్ణారెడ్డిపై వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తి - ఆయనను పక్కన పెడితేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget