Input Subsidy To Farmers: ఏపీ రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేసిన సీఎం వైఎస్ జగన్

YS Jagan Releases Input Subsidy To AP Farmers: గతేడాది నవంబర్‌లో వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీని జమ చేసింది.

FOLLOW US: 

Input Subsidy To AP Farmers: ఏ సీజన్ లో నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో సాయం చేస్తున్నామని, మొత్తం 5,97,311 మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నేల కోత, ఇసుక మేటలతో పంట నష్టపోయిన వారికీ సాయం అందిచామని, దీంతోపాటుగా నేడు 1220 రైతు గ్రూప్ లకు వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లు చెల్లించామని తెలిపారు.

పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ. 542.06 కోట్లు, వైయస్ఆర్ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లు మొత్తం కలిపి రూ. 571.57 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. విత్తనం నుండి అమ్మకం వరకు గొప్ప కార్యక్రమం ఆర్బీకేల ద్వారా జరుగుతోంది. యంత్రసేవా పథకం ద్వారా రైతులను ప్రోత్సహిస్తున్నాం. వైయస్ఆర్ రైతు భరోసా, రైతులకు సున్నా వడ్డీ పథకాల ద్వారా రెండున్నారేళ్ల కాలంలో రైతన్నకు అండగా నిలిచామని సీఎం జగన్ అన్నారు.

గతంలో కష్టాలు.. మన ప్రభుత్వం వచ్చాక వర్షాలు..
రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వర్షాలు సమృద్ధిగా కురిశాయి. రాయలసీమలో కూడా గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది. ఏపీలోని అన్ని ప్రాంతాలు జలాశయాలతో కళకళ లాడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలతో రైతులు పంట నష్టపోయారు. వారికి పరిహారం అందిస్తూ తోడుగా నిలిచామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం టీడీపీ హయాంలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ సరిగా ఇవ్వలేదు. ఇచ్చినా కొద్దిమందికి మాత్రమే ఇచ్చింది. అనేక మంది రైతులకు సబ్సిడీ  ఇవ్వకుండా మోసం చేసింది. నేడు ఆ పరిస్థితిని పూర్తిగా మారుస్తూ శాస్త్రీయంగా అర్హులెవరూ మిగిలిపోకుండా ఈ క్రాప్ డేటాను ఆర్బీకే స్థాయిలో ప్రవేశపెట్టామని సీఎం వివరించారు. 

" నేను సీఎంగా బాధ్యతలు చేప్పట్టిననాటి నుండి ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 19.93 లక్షల మంది రైతులకు రూ. 1612 కోట్లు సాయం అందించాం. 18.70 లక్షల మంది రైతులకు పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం - సీఎం వైయస్ జగన్ "
-
 
Also Read: Manchu Meet Jagan : మెగాస్టార్ టీం కంటే మంచు విష్ణుకే ఎక్కువ పవర్ ! జగన్‌తో భేటీలో ఇదే హైలెట్...

Also Read: TTD Sarvadarshan Tokens: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్, ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్ల జారీ చేసిన టీటీడీ

Published at : 15 Feb 2022 01:53 PM (IST) Tags: YS Jagan YS Jagan Mohan Reddy AP Farmers Input Subsidy To AP Farmers YSR Yantra Seva

సంబంధిత కథనాలు

Mla Balakrishna :  ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే ఈ తిప్పలు, వైసీపీ గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తుంది - ఎమ్మెల్యే బాలకృష్ణ

Mla Balakrishna : ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే ఈ తిప్పలు, వైసీపీ గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తుంది - ఎమ్మెల్యే బాలకృష్ణ

3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

3 Years of YSR Congress Party Rule :   జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

3 Years of YSR Congress Party Rule : యువత ఆశలు గల్లంతు - మూడేళ్లలో జాబ్ క్యాలెండర్ హామీ నిలబెట్టుకోలేకపోయిన సీఎం జగన్ !

3 Years of YSR Congress Party Rule :   యువత ఆశలు గల్లంతు - మూడేళ్లలో  జాబ్ క్యాలెండర్ హామీ నిలబెట్టుకోలేకపోయిన సీఎం జగన్ !

Telugu Desam Party : సై అంటున్న సైకిల్ పార్టీ, సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా వ్యూహరచన

Telugu Desam Party : సై అంటున్న సైకిల్ పార్టీ, సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా వ్యూహరచన

TDP Digital Plan : తెలుగుదేశం డిజిటల్ బాట - యువతకు చేరువయ్యేందుకు కొత్త వ్యూహం !

TDP Digital Plan :   తెలుగుదేశం డిజిటల్ బాట - యువతకు చేరువయ్యేందుకు కొత్త వ్యూహం !

టాప్ స్టోరీస్

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

BSNL 5GB Daily Data Plan: రోజుకు 5 జీబీ డేటా అందించే బీఎస్ఎన్ ప్లాన్ - రూ.600 లోపే - 84 రోజుల వ్యాలిడిటీ!

BSNL 5GB Daily Data Plan: రోజుకు 5 జీబీ డేటా అందించే బీఎస్ఎన్ ప్లాన్ - రూ.600 లోపే - 84 రోజుల వ్యాలిడిటీ!

Indigo OverAction : ఇండిగోకు రూ. ఐదు లక్షల జరిమానా - మళ్లీ అలా చేస్తే ?

Indigo OverAction  :   ఇండిగోకు రూ. ఐదు లక్షల జరిమానా -  మళ్లీ అలా చేస్తే ?

IPL 2022 RR vs RCB Qualifier 2: హల్లాబోల్‌! రాజస్థాన్‌ డెన్‌లో ఆనందాల వెల్లువ!

IPL 2022 RR vs RCB Qualifier 2: హల్లాబోల్‌! రాజస్థాన్‌ డెన్‌లో ఆనందాల వెల్లువ!