అన్వేషించండి

TTD Sarvadarshan Tokens: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్, ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్ల జారీ చేసిన టీటీడీ

TTD Sarvadarshan Tokens: రోనా వ్యాప్తితో చిత్తూరు జిల్లా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపి వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం నేటి నుంచి పునః ప్రారంభించింది.

TTD Sarva Darshan Tokens: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. కరోనా వ్యాప్తితో చిత్తూరు జిల్లా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపి వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నేటి నుంచి పునః ప్రారంభించింది. ఈ తెల్లవారు జామున 5 గంటల నుంచి సర్వ దర్శనం టోకెన్లను ఆఫ్‌లైన్ ద్వారా భక్తులకు జారీ చేసింది. రోజుకు పది వేల టికెట్ల చోప్పున తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ స్వామి సత్రాల్లో ఉచిత దర్శనం టికెట్లను జారీ చేస్తుంది టీటీడీ.

కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వరుడి దర్శనార్ధం దేశ విదేశాల‌ నుండి భక్తులు తిరుమలకు చేరుకుంటారు. కోవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులను స్వామి వారి దర్శనంకు టీటీడీ‌ అనుమతిస్తూ వస్తుంది. ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను జారీ చేస్తూ వచ్చేది టీటీడీ. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు దర్శన టోకెన్ల అందక ఇబ్బందులు వచ్చేవి. దీంతో భక్తులు టీటీడీకి లేఖలు, ఫోన్ ద్వారా తమ సమస్యలు విన్నవించడంతో వైద్య నిపుణుల సూచనలు, సలహాలు మేరకు కోవిడ్ పరిస్ధితులు అనుకూలించడంతో ఆఫ్లైన్ లో‌సర్వదర్శన టోకెన్లు జారీ (TTD issue offline free Darshan Tickets) చేస్తుంది

సామాన్య భక్తులు చాలా వరకూ సర్వదర్శనం టోకెన్లపై ఆధారపడి దాదాపు రెండు ఏళ్ళు‌ పాటు శ్రీవారి దర్శన‌భాగ్యంకు దూరం అయిన వారు ఉండడంతో భక్తుల సౌకర్యార్ధం ఆఫ్లైన్ లో టోకెన్లు జారీని నేటి నుండి ప్రారంభించింది. కరోనా మొదటి దశ తరువాత కోవిడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని పూర్తిగా నిలిపి వేసింది టీటీడీ. కోవిడ్ నుండి కొంత ఉపశమనం రావడంతో మొదటి దశ తరువాత భూదేవి కాంప్లెక్స్ లో రోజుకి ఎమినిది వేల టికెట్లను జారీ చేస్తూ వచ్చింది. ఆ సమయంలో వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తిరుపతికి తరలి వచ్చారు. 

కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభం కావడంతో భక్తుల ఆరోగ్య‌ భధ్రత దృష్ట్యా సర్వదర్శన టోకెన్లను నిలిపి వేశారు. అప్పటి నుండి ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు, సిఫార్సు లేఖలు ద్వారా భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తూ వస్తొంది టీటీడీ. ఈ క్రమంలో రోజు ముప్పై ఐదు వేల మంది మాత్రమే స్వామి వారిని దర్శించుకునే వారు. అయితే గత నాలుగు నెలల క్రితం సర్వదర్శనంను తిరిగి టిటిడి‌ ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకుంది. రోజుకు పది వేల చోప్పున ఆన్లైన్ ద్వారా సామాన్య భక్తుల‌ కోసం టిక్కెట్లను జారీ చేస్తోంది. 

గ్రామీణ ప్రాంతాల భక్తులను టోకెన్లు అందక పోవడంతో‌ తిరుపతిలో‌ నేరుగా రోజుకి పది వేల చోప్పున సర్వదర్శనం టోకెన్లను ఆఫ్లైన్ ద్వారా జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది.. ఈ క్రమంలోనే ఇవాళ వేకువజామున నుండి తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ స్వామి సత్రాల్లో టోకెన్లు జారీ చేస్తుంది టిటిడి..ఆఫ్లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం సామాన్య భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Lord Hanuman: ఆ ఊర్లో ఆంజనేయుడి పేరెత్తారో అయిపోతారంతే

Also Read: Pawan Kalyan: ఎరను ఆహారం అనుకుని ఆశపడుతున్నారు పవన్ సెటైరికల్ ట్వీట్, వాళ్లను ఉద్దేశించేనా?

టాప్ హెడ్ లైన్స్

Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Deputy CM Pawan Kalyan: చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget