Cm Jagan Review: ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తొలగించండి... ఆర్బీకేల్లో ధాన్యం కొలుగోలు చేయాలి... సీఎం జగన్ సమీక్ష
ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర లేకుండా రైతుకు మంచి ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై సీఎం జగన్.. మంత్రులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆర్బీకేల స్థాయిలో, ఫాంగేట్ వద్దే ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం జగన్ తెలిపారు. మోసాలు, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా కొనుగోలు చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర లేకుండా రైతుకు మంచి ధర వచ్చేలా చర్యలు తీసుకున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఖరీఫ్‌లో వరి సాగు, దిగుబడులపై సీఎం జగన్ కు అధికారులు వివరాలు అందించారు. 15.66 లక్షల హెక్టార్లలో వరి సాగుచేశారని అధికారులు వెల్లడించారు. దాదాపు 87 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి ఉంటుందన్నారు. దీంట్లో దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉందని అంచనా వేశారు. రాష్ట్రంలో 6,884 ఆర్బీకేల పరిధిలో వరిని సాగు చేసినట్లు అధికారులు తెలిపారు.
Also Read: ఓ కార్పొరేషన్ -12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ! ఏపీలో మినీ స్థానిక సమరానికి షెడ్యూల్ రిలీజ్ !
ఇ-క్రాప్, ఈ-కేవైసీ అమలు
ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పేమెంట్స్‌లో తప్పిదాలు, మోసాలు లేకుండా చేయడానికి వీలుగా ఇ–క్రాప్ బుకింగ్, ఈ కేవైసీ అమలు చేయాలన్నారు. వ్యవసాయ సలహా మండళ్లు, వీఏఏలు, వాలంటీర్లతో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఆధార్ నంబర్ ఆధారంగా చెల్లింపులు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ధాన్యం సేకరణలో అక్రమాలు, అవకతవకలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. ధాన్యం నాణ్యతను నిర్ధారించే విషయంలో పారదర్శకంగా ఉండేలన్నారు. ధాన్యం సేకరణలో రైతులకు మేలు చేసేలా కొత్త విధానాన్ని అమలు చేయాలన్నారు. ధాన్యం సేకరణపై రైతులకు అవగాహన కల్పించడానికి వాలంటీర్లు, ఆర్బీకేల ద్వారా రైతులకు కరపత్రాలు పంపాలని ఆదేశించారు. అలాగే ధాన్యం సేకరణ వివరాల బోర్డును ఆర్బీకేల్లో ప్రదర్శించాలన్నారు. రైతులకు మంచి ధర పొందేలా తగిన సలహాలు, సూచనలు అందించేలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎలాంటి మినహాయింపులు లేకుండా రైతులకు పూర్తిస్థాయిలో కనీస మద్దతు ధర అందాలన్నారు.
Also Read: మాకు డెడ్ లైన్ పెట్టడానికి నువ్వెవడివి ? పవన్‌పై మంత్రి అప్పలరాజు ఫైర్ !
హాజరైన అధికారులు
ఈ సమీక్షలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, అగ్రి మార్కెటింగ్ ముఖ్య కార్యదర్శి వై మధుసూధన్‌రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్, మార్కెటింగ్ స్పెషల్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఎన్. చంద్రశేఖర్ రెడ్డి నియమాకం