News
News
X

Pawan Vs Appalaraju : మాకు డెడ్ లైన్‌ పెట్టడానికి నువ్వెవడివి ? పవన్‌పై మంత్రి అప్పలరాజు ఫైర్ !

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్షం పెట్టాలన్న పవన్ డిమాండ్‌పై మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. తమకు డెడ్ లైన్ పెట్టడని పవన్ ఎవడని ప్రశ్నించారు.

FOLLOW US: 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్పాలని .. అఖిలపక్షం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వారం డెడ్ లైన్‌ పెట్టిన పవన్ కల్యాణ్‌పై మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజు .. " వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డెడ్ లైన్ పెట్టడానికి నువ్వెవడివి..?" అని ప్రశ్నించేశారు. స్టీల్ ప్లాంట్‌ను అమ్మేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుని చాలా కాలం అయిందని.. ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ గుడ్డి గాడిదకు పళ్లు తోముతూ ఉన్నారా అని ప్రశ్నిచారు. స్టీల్ ప్లాంట్‌ను అమ్మవద్దని గత 9నెలలుగా వైఎస్ఆర్‌సీపీ కృషి చేస్తోందని కనిపించడం లేదా అని మండిపడ్డారు.  

Also Read : ఓ కార్పొరేషన్ -12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ! ఏపీలో మినీ స్థానిక సమరానికి షెడ్యూల్ రిలీజ్ !

9 నెలలుగా షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్‌కు ఏపీలో ఏం జరుగుతోందో అవగాహన లేదన్నారు. తిరుపతి, బద్వేలు ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్‌ను అమ్ముతోంది బీజేపీ అయినా తమ పార్టీకి డెడ్లైన్ పెట్టడం ఏమిటని ఆయన  ప్రశ్నించారు. అడగ్గానే అమిత్ షా నిమిషాల్లో అపాయింట్ మెంట్ ఇస్తారని.. దైవాంస సంభూతుడనని చెబుతావు కాబట్టి వెళ్లి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా అమిత్ షాను ఒప్పించాలని చాలెంజ్ చేశారు.

Also Read : ఏపీలో తొలిసారిగా వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ప్రదానం.. ఇకనుంచి ప్రతి ఏడాది: వైఎస్ జగన్

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపచేశారని..ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి లేఖ కూడా రాశారని అప్పలరాజు గుర్తి చేశారు.  స్టీల్ ప్లాంట్ కు కాప్టివ్ మైన్స్ ఇవ్వాలని.. ప్రస్తుతం ఉన్న భూములను అమ్మేసి పెట్టుబడులు పెట్టండని కూడా జగన్ కోరారన్నారు.  మా పోరాంట చిత్తశుద్ధి ఉన్నదని.. నేడో రేపో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకునేందుకు కేంద్రం నిర్ణయం వెలువరిస్తుందని అప్పలరాజు జోస్యం చెప్పారు. ఆ క్రెడిట్ ఆ క్రెడిట్ వైఎస్ఆర్‌సీపీ  దక్కకూడదు అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆడుతున్న డ్రామాగా కనిపిస్తోందని మండిపడ్డారు.  

Also Read : "సమైక్య రాష్ట్రంగా మళ్లీ ఏపీ" ! సాధ్యమా ? రాజకీయమా?

ప్రైవేటైజేషన్ ఆపాల్సిన కేంద్రాన్ని నువ్వు ఒక్కమాట అడగకుండా..రాష్ట్ర ప్రభుత్వం అమ్మేస్తోందనేలా పవన్ వ్యాఖ్యలు ఉండటమేమిటని ఆయన ప్రశ్నించారు. కేంద్రం చేతిలో ఉన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం ఎంతవరకు సబబన్నారు. గుర్రానికి గడ్డి వేసి గాడిద నుంచి పాలు పిండే ప్రయత్నంలా ఉంది పవన్ వ్యవహారమని విమర్శించారు.  పవన్ కల్యాణ్ కు స్క్రిప్ట్ రాసిన వాళ్లు పక్కదారి పట్టించారని అన్నారు.  

Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల... తెలంగాణలో 6, ఏపీలో 3 స్థానాల్లో ఎన్నికలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 01 Nov 2021 04:53 PM (IST) Tags: pawan kalyan YSRCP janasena visakha steel plant Steel Plant Privatization

సంబంధిత కథనాలు

Vangalapudi Anitha : గోరంట్ల మాధవ్ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయాలి, ఎన్సీడబ్ల్యూకు అనిత లేఖ

Vangalapudi Anitha : గోరంట్ల మాధవ్ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయాలి, ఎన్సీడబ్ల్యూకు అనిత లేఖ

Salman Khan: వైజాగ్‌ నేవీ సిబ్బందితో కలిసి సల్లూ భాయ్ స్వాతంత్య్ర వేడకలు

Salman Khan: వైజాగ్‌ నేవీ సిబ్బందితో కలిసి సల్లూ భాయ్ స్వాతంత్య్ర వేడకలు

Breaking News Live Telugu Updates: ఆగస్టు 15 నుంచి తెలంగాణలో పింఛన్ల జాతర- మరో పది లక్షలకు క్యాబినెట్ ఆమోదం

Breaking News Live Telugu Updates: ఆగస్టు 15 నుంచి తెలంగాణలో పింఛన్ల జాతర- మరో పది లక్షలకు క్యాబినెట్ ఆమోదం

Vruksha Bandhan: రక్షా బంధన్ కాదిది వృక్షా బంధన్- విశాఖలో మహిళల వినూత్న వేడుక

Vruksha Bandhan: రక్షా బంధన్ కాదిది వృక్షా బంధన్- విశాఖలో మహిళల వినూత్న వేడుక

AP Government : నాయీ బ్రాహ్మణలను అలా పిలిస్తే కేసులు - ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం !

AP Government : నాయీ బ్రాహ్మణలను అలా పిలిస్తే కేసులు - ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం !

టాప్ స్టోరీస్

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?

Telangana Cabinet : ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !

Telangana Cabinet :  ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?