అన్వేషించండి

CM Chandrababu: 'మండుటెండలో మీ కష్టాలు చూసి చలించా' - పెన్షన్ దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ

Andhrapradesh News: ఏపీ సీఎం చంద్రబాబు పెన్షన్‌దారులకు బహిరంగ లేఖ రాశారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే పెన్షన్ల పెంపు వర్తింపచేశామని.. ప్రజా సంక్షేమం కోసమే తమ నిర్ణయాలని పేర్కొన్నారు.

CM Chandrababu Open Letter To Pensioners: ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. ఈ మేరకు పింఛన్ దారులకు శనివారం బహిరంగ లేఖ రాశారు. ఆర్థిక సమస్యలున్నా.. ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. 'ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే పింఛన్ ఒకేసారి రూ.వెయ్యి పెంచి ఇస్తున్నాం. దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. జులై 1 నుంచి ఇంటి వద్దే పెన్షన్ అందిస్తాం. పింఛన్ల విషయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఎంతో క్షోభ పెట్టింది. ఎన్నికల సమయంలో 3 నెలలు మీ కష్టాలు చూసి చలించిపోయాను. వడగాలులు, మండుటెండల మధ్యలో ఎంతో మంది పింఛన్ దారులు పెన్షన్ సకాలంలో అందక ఎన్నో అగచాట్లు పడ్డారు. ఆ ఇబ్బందులను చూసి ఏప్రిల్ నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తానని మాట ఇచ్చాను. పింఛన్ల పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడనుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకూ పెంపును వర్తింపచేసి మొత్తం పింఛన్ జులైలో మీకు అందిస్తున్నాం.' అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

ఒకేసారి రూ.7 వేలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు తొలి 5 సంతకాల్లో రెండో సంతకం పెన్షన్ల పెంపుపైనే చేశారు. ఒకటో కేటగిరీలోని వృద్ధులు, వితంతువులు ఇతర 11 ఉప కేటగిరీలకు చెందిన వారి పింఛన్ సొమ్ము రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచారు. ఏప్రిల్ నుంచే దీన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు మొత్తం 3 నెలలకు సంబంధించి ఎరియర్లతో కలిపి జులైలో ఒకేసారి రూ.7 వేలు అందించనున్నారు. అలాగే, రెండో కేటగిరీలో పాక్షిక దివ్యాంగులకు రూ.3 వేల - రూ.6 వేలు, మూడో కేటగిరీకి సంబంధించి పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ.5 వేల - రూ.15 వేలు, నాలుగో కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచిన పింఛన్ సొమ్ము అందించనున్నారు. జులై 1 ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారుల ఇంటి వద్దే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు అందిస్తారు. ఈ మేరకు ఒక్కో ఉద్యోగి 50 మందికి పెన్షన్లు అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను సీఎస్ నీరభ్ కుమార్ ఇప్పటికే ఆదేశించారు. వీలైనంత వేగంగా ఒకే రోజులో పెన్షన్ల పంపిణీ పూర్తి కావాలని.. అవసరమైతే మంగళవారం కూడా పంపిణీ చేపట్టాలని నిర్దేశించారు.

వారికి మాత్రం అకౌంట్లలో..

రాష్ట్రంలో పెరిగిన పింఛన్ల మేరకు 65,18,496 మంది లబ్ధిదారులకు రూ.4,399.89 కోట్లు పంపిణీ చేయనున్నారు. వీరిలో 64.75 లక్షల మందికి ఇంటి వద్ద రూ.4,369.82 కోట్లు ఇంటి వద్ద అందించనుండగా.. మిగిలిన 43 వేల మంది బయట చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు రూ.30.05 కోట్లను నేరుగా వారి అకౌంట్లలోకి జమ చేస్తారు. 

Also Read: IPS Officers Transfers: ఏపీ సీఐడీ చీఫ్‌గా రవిశంకర్‌- మరోసారి IPSల బదిలీలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
IRCTC Tour Package: దుబాయ్, అబుదాబి వెళ్లాలనుకునేవారికి IRCTC టూర్ ప్యాకేజీ.. ఖర్చు, ప్లాన్ వివరాలివే
దుబాయ్, అబుదాబి వెళ్లాలనుకునేవారికి IRCTC టూర్ ప్యాకేజీ.. ఖర్చు, ప్లాన్ వివరాలివే
Hyderabad- Vijayawada National Highway: హైదరాబాద్ - విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణ, జాతీయ రహదారి 65 విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్
హైదరాబాద్ - విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణ, జాతీయ రహదారి 65 విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్
Royal Enfield Bullet Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 వచ్చేస్తోంది.. పవర్‌ఫుల్ ఇంజిన్‌, అద్భుతమైన ఫీచర్లు చూశారా
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 వచ్చేస్తోంది.. పవర్‌ఫుల్ ఇంజిన్‌, అద్భుతమైన ఫీచర్లు చూశారా
Advertisement

వీడియోలు

పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్
అబ్బాయిలకో న్యాయం?  అమ్మాయిలకో న్యాయమా?
3i Atlas interstellar object | 9 ఏళ్లలో 3 సార్లు.. భూమి కోసమా? సూర్యుడి కోసమా? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
IRCTC Tour Package: దుబాయ్, అబుదాబి వెళ్లాలనుకునేవారికి IRCTC టూర్ ప్యాకేజీ.. ఖర్చు, ప్లాన్ వివరాలివే
దుబాయ్, అబుదాబి వెళ్లాలనుకునేవారికి IRCTC టూర్ ప్యాకేజీ.. ఖర్చు, ప్లాన్ వివరాలివే
Hyderabad- Vijayawada National Highway: హైదరాబాద్ - విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణ, జాతీయ రహదారి 65 విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్
హైదరాబాద్ - విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణ, జాతీయ రహదారి 65 విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్
Royal Enfield Bullet Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 వచ్చేస్తోంది.. పవర్‌ఫుల్ ఇంజిన్‌, అద్భుతమైన ఫీచర్లు చూశారా
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 వచ్చేస్తోంది.. పవర్‌ఫుల్ ఇంజిన్‌, అద్భుతమైన ఫీచర్లు చూశారా
ISRO Gaganayan Vyomitra: గగనయాన్‌కు తొలిమెట్టు.. మానవరోబో వ్యోమిత్రను అంతరిక్షంలోకి పంపుతున్న ఇస్రో
గగనయాన్‌కు తొలిమెట్టు.. మానవరోబో వ్యోమిత్రను అంతరిక్షంలోకి పంపుతున్న ఇస్రో
Aadi Saikumar: ప్రభాస్ వల్ల 'శంబాల'కు ఫ్యాన్స్ సపోర్ట్... ఫ్లాపులు, సక్సెస్ రేట్‌పై ఆది సాయికుమార్ రియాక్షన్!
ప్రభాస్ వల్ల 'శంబాల'కు ఫ్యాన్స్ సపోర్ట్... ఫ్లాపులు, సక్సెస్ రేట్‌పై ఆది సాయికుమార్ రియాక్షన్!
Hyderabad Crime News: పీఎస్ ఎదుటే నిప్పంటించుకుని డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వ్యక్తి ఆత్మహత్య
పీఎస్ ఎదుటే నిప్పంటించుకుని డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వ్యక్తి ఆత్మహత్య
Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి
ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి
Embed widget