అన్వేషించండి

Covid Vaccination: ఏపీలో 65 శాతం పూర్తైన వ్యాక్సినేషన్... దేశంలో 129 కోట్ల వ్యాక్సిన్లు పంపిణీ

ఏపీలో వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 65 శాతం మందికి రెండు డోసుల టీకాలు వేసినట్లు అధికారులు తెలిపారు. మొదటి డోసు కవరేజ్ దాదాపు 91 శాతం పూర్తైందని తెలిపారు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయినా కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ స్పీడప్ చేసింది. కరోనాపై పోరాటంలో భాగంగా వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం దృష్టిసారించింది. అధికారులను అప్రమత్తం చేస్తూ తగిన ఆదేశాలు జారీ చేస్తుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18 ఏళ్లు పైబడిన వారిలో 65 శాతం మందికి రెండు డోసుల టీకా వేసినట్టు అధికారులు చెబుతున్నారు. మొదటి డోసు కవరేజ్ దాదాపు 91 శాతం పూర్తైందని తెలిపారు. 

Also Read: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం

దేశ వ్యాప్తంగా 129 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ

రాష్ట్రాల‌ు, కేంద్రపాలిత ప్రాంతాల‌కు ఇప్పటివ‌ర‌కు 129 కోట్ల వ్యాక్సిన్ డోసులు స‌ర‌ఫ‌రా చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ‌ ప్రకటించింది. 2021 జ‌న‌వ‌రి 16న‌ దేశ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్రక్రియ మొద‌లైంది. వ్యాక్సిన్‌ల కొరత కారణంగా మొద‌ట్లో వ్యాక్సినేష‌న్ నత్తనడకగా కొన‌సాగింది. క్రమంగా టీకాల‌ ఉత్పత్తి పెరగడంతో వ్యాక్సినేష‌న్ ప్రక్కియ ఊపందుకుంది. 2021 జూన్ 21న దేశవ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌లో ప్రారంభ‌మైంది. దేశంలో రోజువారి కరోనా కేసులు 558 రోజుల కనిష్ఠానికి చేరాయి. మంగళవారం కొత్తగా 6,822 కేసులు నమోదయ్యాయి. 220 మంది మృతి చెందారు. 10,004 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 95,014కు చేరింది. 554 రోజుల్లో ఇదే కనిష్ఠం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి

  • మొత్తం కేసులు: 3,46,48,383
  • ‬మరణాలు: 4,73,757
  • యాక్టివ్ కేసులు: 95,014
  • కోలుకున్నవారు: 3,40,79,612

మొత్తం కేసుల సంఖ్య 4,73,757కు పెరిగింది. రికవరీ రేటు 98.36%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం. గత 11 రోజులుగా కరోనా కేసులు 10 వేల కంటే తక్కువే నమోదవుతున్నాయి. గత 163 రోజులుగా 50 వేల కంటే తక్కువే ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.27గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. దేశంలో టీకాల పంపిణీ వేగంగా కొనసాగుతోంది. మరో 79,39,038 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 128.76 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. 

Also Read: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!

వీడియోలు

ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
టీమిండియా ప్లేయర్ల కెరీర్ ని సెలెక్టర్లు నాశనం చేస్తున్నారు: మహమ్మద్ కైఫ్
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
H1B visa: హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
Delhi Metro: ఢిల్లీ మెట్రోకు మరో 12 వేల కోట్లు - కేంద్ర కేబినెట్ నిర్ణయం - హైదరాబాద్ మెట్రోకు ఎదురుచూపులే!
ఢిల్లీ మెట్రోకు మరో 12 వేల కోట్లు - కేంద్ర కేబినెట్ నిర్ణయం - హైదరాబాద్ మెట్రోకు ఎదురుచూపులే!
Virat Kohli : విరాట్ కోహ్లీ శతకంతో చరిత్ర! 16 వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డు
విరాట్ కోహ్లీ శతకంతో చరిత్ర! 16 వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డు
Embed widget