AP Drone Technology: డ్రోన్ టెక్నాలజీకి నాలెడ్జ్ పార్టనర్‌గా ఐఐటీ తిరుపతితో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
Amaravati Drone Summit 2024: ఏపీ ప్రభుత్వం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో అమరావతి డ్రోన్ సమ్మిట్ ను నిర్వహించింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సీఎం చంద్రబాబు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Andhra Pradesh Govt agreement with IIT Tirupati for Drone Technology | అమరావతి: ఏపీ ప్రభుత్వం అమరావతిలో డ్రోన్ సమ్మిట్ మంగళవారం ఉదయం ప్రారంభించింది. డ్రోన్ టెక్నాలజీకి నాలెడ్జ్ పార్టనర్‌గా ఐఐటీ తిరుపతితో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి (IIT Tirupati), దాని టెక్నాలజీ ఇన్నోవేషన్ హ, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ (AP Drone Corporation) కలిసి పనిచేయనున్నాయి. ఈ సహకారంతో ఇంటిగ్రేషన్, డిజిటల్ ట్విన్ టెక్నాలజీ, స్టార్టప్ సపోర్ట్ తో పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించడం లాంటి పలు రంగాలలో సాంకేతిక అభివృద్ధిపై ఫోకస్ చేయనున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ఉమ్మడిగా పరిశోధన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సాంకేతికంగా మరిన్ని ఆవిష్కరణలను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అమరావతిలో జరిగిన డ్రోన్ సమ్మిట్ లో ఐఐటీ తిరుపతి (IIT Tirupati)కి చెందిన సుమారు 15 మంది విద్యార్థులు, 8 మంది అధ్యాపకులు ఈ హ్యాకథాన్‌లో పాల్గొన్నారు. ప్రాజెక్ట్ లలో ఒకటైన “ప్రకృతి విపత్తుల సమయంలో నెట్‌వర్క్‌ని పునరుద్ధరించడానికి ఏరియల్ బేస్ స్టేషన్” ను IIT ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సర్వేంద్ర నాథ్ క్రియేట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ తిరుపతికి అవార్డు దక్కింది.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ డ్రోన్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఇందులో ప్రారంభోపాన్యాసం చేసిన సీఎం చంద్రబాబు డ్రోన్లపై ప్రసంగించారు. ఫ్యూచర్ గేమ్ ఛేంజర్స్ డ్రోన్స్ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. 1995లో తాను తొలిసారి సీఎం అయినప్పుడు ఐటీ గురించి చెబితే ఎవరూ అంతగా నమ్మలేదన్నారు. కానీ ఇప్పుడు అంతా డిజిటల్ యుగంలో జీవిస్తున్నామని, ప్రతి విషయంలో టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో టెక్నాలిజీని డ్రోన్స్ మరో స్థాయికి తీసుకెళ్తాయని తనకు నమ్మకం ఉందన్నారు చంద్రబాబు. అందుకోసమే డ్రోన్స్ డెవలప్‌మెంట్‌పై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఐటీ రంగంలో అభివృద్ధితో హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసునని, ఇప్పుడే డ్రోన్స్ అభివృద్ధితో అమరావతి కూడా డెవలప్ సిటీ నిలుస్తుందని చంద్రబాబు దీమా వ్యక్తం చేశారు. ఏపీని డ్రోన్స్ హబ్ గా మార్చుతాం, ఇటీవల విజయవాడలో వరదల సమయంలో ప్రభుత్వం డ్రోన్స్ ద్వారా వరద బాధితులకు సహాయం చేసిందని గుర్తుచేశారు. రెస్క్యూటీం వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్స్ సేవలు అందించాయన్నారు.
Also Read: Andhra Pradesh : వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు సహా కీలక సేవలు - మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం