AP Digital Employment Exchange: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్…మూడేళ్లలో 55 వేల ఉద్యోగాలే లక్ష్యం...ఆగస్టు 15న డిజిటల్ ఎప్లాయిమెంట్ ఎక్సేంజ్ ప్రారంభం

మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 55 వేల ఐ.టీ ఉద్యోగాలు కల్పిస్తామంటోంది ఏపీ ప్రభుత్వం. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూనే…ఆగస్టు 15న డిజిటల్ ఎప్లాయిమెంట్ ఎక్సేంజ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

FOLLOW US: 

అప్పట్లో ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ లో రిజిస్టర్ చేసుకోవడం అనేది ఓ పెద్ద టాస్క్ లా ఉండేది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేయించుకుని వచ్చేస్తే ఇక ఉద్యోగం గ్యారంటీ అనే భావన కూడా కొందరిలో ఉండేది. ఆ తర్వాత ట్రెండ్ మారడంతో అంతా ఆన్ లైన్ అయిపోయింది. దీంతో నెమ్మదిగా ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ లో రిజిస్టర్ చేసుకునే వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ మళ్లీ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అయితే గతంలోలా కాకుండా ఈసారి డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ అందుబాటులోకి రానుంది.

రాష్ట్రవ్యాప్తంగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నామన్న జగన్ సర్కార్…రాష్ట్రంలో ప్రతి జిల్లాలో నెలకు రెండు సార్లు మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని చెప్పింది. ఈ మేరకు ఆగస్టు 15న డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్ఛ్సేంజ్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  జూన్ 22న ఐటీ శాఖపై సమీక్ష నిర్వహించిన సంబంధిత శాఖా మంత్రి మోకపాటి గౌతమ్ రెడ్డి ఈఎంసీ, ఐటీ ప్రమోషన్, పాలసీ తదితర అంశాలపై చర్చించారు. స్కిల్ కాలేజీల పనుల పురోగతి, నిధుల సమీకరణలో వేగానికి చర్యలు తీసుకోవాలని ఈ మేరకు అధికారులను సూచించారు. అన్ని ప్రధాన నగరాల్లోనూ ఐటీ రంగంలో ఎలా ముందుకెళ్లాలో ప్రణాళికలు రచించాలని సూచనలు చేశారు.

అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచేందుకు కసరత్తు చేస్తున్నామని…ఎన్ని ఉద్యోగాలివ్వగలమన్నది నైపుణ్య, శిక్షణ ఎంత మందికి ఇచ్చామన్నదానిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. అందుకు తగిన సహకారం, ఏర్పాట్ల గురించి మరింత దృష్టి పెట్టాలన్నారు. ఐ.టీ, ఎలక్ట్రానిక్, మొబైల్ తయారీ, టీవీ తయారీ, స్టీల్ కంపెనీల ద్వారా త్వరలో మరింత ఉపాధి కల్పన దిశగా అడుగులు వేస్తున్నామని, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ద్వారా అత్యాధునిక కోర్సులు, అపార అవకాశాలు.. సీవోఈల ఏర్పాటుపై మరింత శ్రద్ధ వహించాలని మంత్రి అధికార్లను కోరారు.

సీఎం సొంత జిల్లా భవిష్యత్ లో వైఎస్ఆర్ కడపలోని కొప్పర్తి ఈఎంసీ ద్వారా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయన్నారు మంత్రి. ఇతర జిల్లాల్లో కంపెనీల స్థాపన.. పెట్టుబడుల ఆకర్షణకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనపైనా దృష్టిసారించామన్నారు. బ్యాంకులతో సంప్రదించి నిధులు తెచ్చుకునే మార్గాలపై అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వెంకటగిరి, కర్నూలు జిల్లా డోన్ స్కిల్ కాలేజీల భూ సేకరణ పనుల పురోగతిపై ఆరాతీసిన గౌతమ్ రెడ్డి….అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న స్కిల్ కాలేజీ భూసేకరణ పనిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు..

Published at : 22 Jul 2021 10:34 PM (IST) Tags: ANDHRA PRADESH jagn government Digital Employment Exchange August 15th help Unemployed

సంబంధిత కథనాలు

Gold Rate Today 26th June 2022: వినియోగదారులకు ఊహించని షాక్‌లు ఇస్తున్న బంగారం- ఇవాల్టి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 26th June 2022: వినియోగదారులకు ఊహించని షాక్‌లు ఇస్తున్న బంగారం- ఇవాల్టి ధరలు ఎలా ఉన్నాయంటే?

Amaravati Lands: అమరావతి భూములు కొంటారా ? ఎకరం పది కోట్లే  !

Amaravati Lands: అమరావతి భూములు కొంటారా ? ఎకరం పది కోట్లే  !

Pawan Kalyan : జనసేన కౌలు రైతు భరోసా నిధికి పవన్ తల్లి అంజనా దేవీ విరాళం

Pawan Kalyan : జనసేన కౌలు రైతు భరోసా నిధికి పవన్ తల్లి అంజనా దేవీ విరాళం

Vijayawada News : ఇంద్రకీలాద్రిపై అవకతవకలు, దుర్గమ్మ చీరలు మాయం!

Vijayawada News : ఇంద్రకీలాద్రిపై అవకతవకలు, దుర్గమ్మ చీరలు మాయం!

APL League : ఆంధ్రా ప్రీమియర్ లీగ్ కు నెల్లూరు కుర్రాళ్ల ఎంపిక, జులై 6 నుంచి మ్యాచ్ లు

APL League :  ఆంధ్రా ప్రీమియర్ లీగ్ కు నెల్లూరు కుర్రాళ్ల ఎంపిక, జులై 6 నుంచి మ్యాచ్ లు

టాప్ స్టోరీస్

DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!

DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!

CM Jagan: రూట్ మారుస్తున్న సీఎం జగన్- ప్లీనరీ తర్వాత ఆ విమర్శలకు చెక్‌ పెడతారట! 

CM Jagan: రూట్ మారుస్తున్న సీఎం జగన్- ప్లీనరీ తర్వాత ఆ విమర్శలకు చెక్‌ పెడతారట! 

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

Actor Sai Kiran : పోలీసులను ఆశ్రయించిన గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి ఫాదర్- మోసం పోయానంటూ ఫిర్యాదు

Actor Sai Kiran : పోలీసులను ఆశ్రయించిన గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి ఫాదర్- మోసం పోయానంటూ ఫిర్యాదు