Cm Jagan Review: కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు... పంట మార్పిడిపై రైతులకు అవగాహన... వ్యవసాయశాఖపై సీఎం జగన్ సమీక్ష
పంట మార్పిడి చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వరి కన్నా ఎక్కువ ఆదాయం వచ్చే పంటల్ని సూచించాలని, పంట మార్పిడికి ప్రోత్సహకాలు అందించాలన్నారు.
రైతులకు ప్రత్యామ్యాయ పంటలపై అవగాహన కల్పించి, పంట మార్పిడికి తగిన తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయశాఖ, ధాన్యం సేకరణపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు మరింత ఆదాయం వచ్చేలా చూడాలని సీఎం అన్నారు. వరి కన్నా తృణధాన్యాలు పండిస్తే కూడా వచ్చేలా చూడాలన్నారు. రైతుల పంట మార్పిడికి ప్రోత్సాహకాలు అందించాలన్నారు. మిల్లెట్స్ పండించినా రైతులకు మంచి ఆదాయం వచ్చే విధానాలు సూచించాలన్నారు. మిల్లెట్స్ బోర్డును ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్... మిల్లెట్స్ అధికంగా సాగు చేసే ప్రాంతాల్లో ప్రాససింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన
సీఎం జగన్ మాట్లాడుతూ... రైతులకు సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచాలన్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా సేంద్రీయ పద్ధతుల్లో పంట సాగును ప్రోత్సహించాలన్నారు. రైతు భరోసా కేంద్రాలను యూనిట్‌గా ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆర్గానిక్ వ్యవసాయానికి అవసరమైన పరికరాలను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. సేంద్రీయ వ్యవసాయంలో వాడే పరికరాలు, ఎరువులు తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్‌లో 1.12 కోట్ల ఎకరాలను ఇ–క్రాప్ నమోదు చేశామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. రబీ ఇ– క్రాప్ ప్రారంభించామని తెలిపారు. ఆర్బీకేల ద్వారా ప్రకృతి వ్యవసాయం సర్టిఫికేషన్ ఇచ్చేలా చూడాలని సీఎం అన్నారు.
Also Read: ఈటలకు షాక్.. ఆ భూముల కబ్జా నిజమేనని చెప్పిన కలెక్టర్
కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
రైతులకు కల్తీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకువాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చర్యల చేపట్టాలన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించాలనే ఉద్దేశంతో ఆర్బీకేలు ఏర్పాటుచేశామన్నారు. అక్రమాలకు పాల్పడ్డే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విత్తనాల కోరత లేకుండా చూడాలన్నారు. డిమాండ్ మేరకు రైతులకు విత్తనాల సరఫరా చేయాలన్నారు.
Also Read: కరీంనగర్ లో కరోనా కలకలం... 46 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్
జగనన్న పాలవెల్లువపై సమీక్ష
డిసెంబరులో కృష్ణా, అనంతపురం జిల్లాల్లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పాలవెల్లువ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకూ 1,77,364 మహిళలకు లబ్ధి చేకూరిందన్నారు. రోజువారీ పాలసేకరణ నవంబర్ 2020లో 2,812 లీ ఉంటే నవంబర్ 2021లో 71,911 లీటర్లకు చేరిందన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 1 కోటి 32 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేశామని సీఎంకు తెలిపారు.
Also Read: కొడికొండ - మేదరమెట్ల హైవేకి గ్రీన్ సిగ్నల్.. పాత ప్రాజెక్టు ప్లాన్ కనుమరుగే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి