By: ABP Desam | Updated at : 28 Feb 2022 12:56 PM (IST)
సీఎం జగన్ (ఫైల్ ఫోటో)
‘జగనన్న తోడు’ (Jagananna Thodu) పథకం కింద ఏపీ సీఎం వైస్ జగన్ (YS Jagan) నిధులను విడుదల చేశారు. రోడ్ల పక్కన లేదా తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే వారు వంటి చిరు వ్యాపారులను ఆదుకునే ఉద్దేశంతో జగనన్న తోడు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా చిరు వ్యాపారులు మొత్తం 5,10,462 మందికి ప్రభుత్వం రూ.510.46 కోట్లను విడుదల చేసింది. వీరికి ఇచ్చే రూ.10 వేల రుణాలను వడ్డీ లేకుండా పంపిణీ చేస్తున్నారు. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు 2020 నవంబర్ 25న ప్రభుత్వం ప్రత్యేకంగా ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఇప్పటికే తొలి విడతలో 5,35,112 మందికి, రెండో విడతలో 3,70,517 మందికి, రెండు విడతల్లో కలిపి మొత్తం 9,05,629 మందికి రుణాలను అందజేసింది.
మూడో విడతలో భాగంగా జరిగిన ఈ రుణాల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నిధులు విడుదల చేసి ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ (CM Jagan) మాట్లాడారు. చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు పథకం లక్ష్యం అని తెలిపారు. చిరు వ్యాపారులు తమకు తాము ఉపాధి కల్పించుకోవడం గొప్ప విషయమని, లక్షల మంది చిరు వ్యాపారులు స్వయంగా ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు.
వారి కాళ్ల మీద వారు నిలబడడానికి ఎంతగానో ఈ పథకం ఉపయోగపడుతుందని సీఎం జగన్ వెల్లడించారు. తాను చేసిన పాదయాత్రలో చిరు వ్యాపారులు పడుతున్న కష్టాలు చూశానని జగన్ తెలిపారు. చిరు వ్యాపారులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకం తీసుకొచ్చామని అన్నారు. వడ్డీ లేని రుణాలు తీసుకున్నవారికి క్రమం తప్పకుండా మళ్లీ లోన్లు ఇస్తామని అన్నారు. ఇప్పటి వరకూ 14 లక్షల మందికి లబ్ధి కలిగేలా చేయగలిగామని వెల్లడించారు. మూడో విడత కింద 5,10,462 మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనున్నట్లు వెల్లడించారు.
ఈ జగనన్న తోడు (Jagananna Thodu) పథకానికి అర్హులై ఉండి ఒకవేళ రుణం కనుక రాకపోతే, గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు. లబ్ధి దారులకు ఈ పథకం గురించి సందేహాలు ఉంటే 08912890525 అనే నెంబరుకు కాల్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. ఎలాంటి అవినీతికి, అక్రమాలకు చోటు లేకుండా లబ్ధిదారులకు రుణాలు అందిస్తున్నామని వివరించారు. ఎవరికైనా డబ్బులు రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.
Krishna Road Accident : కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఫ్లెక్సీ అడ్డురావడంతో బోల్తా పడిన ఆటో, నలుగురి మృతి
YSRCP Bus Yathra : ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానంగా బస్సు యాత్ర- వ్యతిరేకత రాకుండా వైసీపీ స్కెచ్
AP Ministers Bus Tour: శ్రీకాకుళం టు అనంతపురం- నేటి నుంచే ఏపీ మంత్రుల బస్సు యాత్ర
Pawan Kalyan: మహానేతలను ఒక్క జిల్లాకే పరిమితం చేస్తారా ? వైసీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ ఇదే: పవన్ కళ్యాణ్
Vegetable Rates: ఏపీలో కూరగాయల రేట్ల నియంత్రణకు ప్రత్యేక యాప్, సీఎస్ ఆదేశాలు
PM Modi Hyderabad Tour: కేసీఆర్పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!
Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు
Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్
PM Modi In ISB: 25 ఏళ్లకు వృద్ధి మ్యాప్ రెడీ- ఐఎస్బీ హైదరాబాద్లో ప్రధానమంత్రి మోదీ