అన్వేషించండి

CM Jagan Review: 9 నుంచి ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ - కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష, కీలక ఆదేశాలు

CM Jagan News: ఈ సమీక్షలో సీఎం జగన్ కలెక్టర్లకు, అధికారులకు కీలక సూచనలు చేశారు. జగనన్న ఆరోగ్య సురక్షలో సాధించిన పురోగతి గురించి సీఎంకు అధికారులు వివరించారు.

AP News in Telugu: జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్‌ జగన్‌ రెండు ముఖ్యమైన కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమీక్షలో సీఎం జగన్ కలెక్టర్లకు, అధికారులకు కీలక సూచనలు చేశారు. జగనన్న ఆరోగ్య సురక్షలో సాధించిన పురోగతి గురించి సీఎంకు అధికారులు వివరించారు. ‘‘జగనన్న ఆరోగ్య సురక్ష చాలా ముఖ్యమైనది. వైద్య శిబిరాల నిర్వహణ దాదాపు చివరి దశకు వచ్చింది. 10,032 గ్రామ సచివాలయాల్లో దాదాపు 98శాతం వార్డు సచివాలయాల్లో 77శాతం శిబిరాల నిర్వహణ పూర్తయ్యింది. శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు చేయూత నివ్వడం చాలా ముఖ్యం. జగనన్న ఆరోగ్య సురక్ష కింద నిర్వహించిన శిబిరాలు సాధారణ వైద్య శిబిరాలు కావు. శిబిరాలు నిర్వహణ పూర్తయ్యాక అసలు పని మొదలవుతుంది. శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు పూర్తిస్థాయిలో చేయూత నివ్వడం అన్నది అత్యంత ముఖ్యమైనది. కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి నయం అయ్యేంతవరకూ మనం చేదోడుగా నిలుస్తాం.

మొదటగా ప్రతి ఇంటికీ వెళ్లి.. జల్లెడపడుతూ, అందరికీ పరీక్షలు నిర్వహించాం. ఆ పేషెంట్లను శిబిరానికి తీసుకురావడం, పరీక్షలు నిర్వహించడం, అక్కడ మందులు ఇవ్వడం జరుగుతోంది. అర్బన్‌ ఏరియాల్లో 91 శాతం, రూరల్‌ ఏరియాల్లో 94శాతం స్క్రీనింగ్‌ పూర్తయ్యింది. 1.44 కోట్ల కుటుంబాల్లోని వారికి ఇప్పటికే స్క్రీనింగ్‌ పూర్తిచేశారు. 6.4 కోట్ల ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించారు.

జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు

జనవరి 1 నుంచి క్రమం తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహిస్తారు. ప్రతి నెలా మండలంలో నాలుగు క్యాంపులు నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళిక. ఆరోగ్య శ్రీ కింద నమోదుకాని రోగాలు ఏమైనా కనిపించినా.. ప్రత్యేక కేసుల కింద పరిగణించి వారికి ఉచితంగా ఆరోగ్య శ్రీ కింద చికిత్సలు అందిస్తాం. ఈ పేషెంట్లను గుర్తించి, వారికి చికిత్సలు అందించే బాధ్యతను మనమే తీసుకోవాలి.

పేషెంట్లు నిర్ణీత కాలానికి ఆస్పత్రులకు వెళ్లేలా చూడాల్సిన బాధ్యత విలేజ్‌ క్లినిక్స్‌కు, ఫ్యామిలీ డాక్టర్‌కు ఉంది. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల కింద గుర్తించిన పేషెంట్లకు నాణ్యమైన సేవలు అందించడం అన్నది అత్యంత ముఖ్యమైన విషయం. 8.7 లక్షల మందికి కంటి పరీక్షలు చేయించుకున్నారు. 5.22 లక్షల మందికి కంటి అద్దాలు ఇవ్వాలని డాక్టర్లు చెప్పారు. వీరికి వెంటనే కంటి అద్దాలు అందించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే 73 వేలమందికిపైగా కంటి సర్జరీలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వీరికి కూడా వెంటనే సర్జరీలు చేయించేలా చూడాలి. డిసెంబర్‌ నెలాఖరు నాటికి ఈ కార్యక్రమాలన్నీకూడా పూర్తికావాలి.

ఒక మూడోది ఇప్పటికే తీవ్ర రోగాలతో బాధపడుతున్న వారికి తగిన రీతిలో చేయూత నందించాలి. ఈ మందులు ఖరీదైనవి కాబట్టి, వాళ్లు మందులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వారికి కూడా మందులు అందించాలి. మందులు ఎంత ఖరీదైనా సరే, పేషెంట్లకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ మేరకు అధికారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. గ్రామ వార్డు సచివాలయం, విలేజ్‌ క్లినిక్‌ ఆధారంగా మ్యాపింగ్‌ చేసి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్‌తో అనుసంధానం చేయాలి.

మరికొన్ని అంశాలు

రాబోయే రోజుల్లో ఆరోగ్య సేవలు మరింత విస్తరించనున్నాయి. 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ప్రతి జిల్లాలోకూడా అత్యాధునిక సేవలు అందించే బోధనాసుపత్రి అందుబాటులో ఉంటుంది. ఉన్న మెడికల్ కాలేజీలను కూడా పునరుద్ధరిస్తున్నాం. రిక్రూట్‌మెంట్‌ పాలసీమీద కలెక్టర్లు పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. ఎక్కడైనా స్పెషలిస్టులు, డాక్టర్లు, ఇతర సిబ్బంది కొరత లేకుండా సంబంధిత జిల్లాల కలెక్టర్లు చూసుకోవాలి. ఇప్పటికే 53 వేలమందిని ఆరోగ్య రంగంలో ఖాళీలను మనం భర్తీచేశాం. ఎక్కడ ఖాళీలు ఉన్నా, వెంటనే భర్తీచేసేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి. ఆరోగ్య రంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నాం కాబట్టే, మెడికల్‌ రిక్రూట్‌ బోర్డును సృష్టించడం జరిగింది. ప్రివెంటివ్‌ కేర్‌లో జగనన్న సురక్ష, విలేజ్‌ క్లినిక్‌, ఫ్యామిలీడాక్టర్‌ కాన్సెప్ట్‌లు అత్యంత కీలకం అవుతున్నాయి. 

పౌష్టికాహారం లోపం, రక్తహీనత సమస్యలను పూర్తిగా నివారించాలి.
ఈ సమస్యలతో బాధపడుతున్నవారికి సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారం అందుతుందా, వారికి మందులు అందుతున్నాయా అన్న విషయాన్ని విలేజ్‌ క్లినిక్‌ ద్వారా పరిశీలన చేయించాలి. లక్ష్యాలను సాధించడానికి దేశంలో ఏ రాష్ట్రాంలోని కలెక్టర్లకు లేని యంత్రాంగం, మన రాష్ట్రంలో కలెక్టర్లకు ఉంది. విలేజ్‌ క్లినిక్స్‌, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెస్ట్‌, గ్రామ-వార్డు సచివాలయాల వ్యవస్థ ఉంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి వ్యవస్థలు లేవు. సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో అన్ని రాష్ట్రాలకన్నా ముందు ఉంచేందుకు ఇవి ఉపయోగపడతాయి. కలెక్టర్లకు మంచి అభిరుచి ఉంటే కచ్చితంగా లక్ష్యాలు సాధిస్తాం. 

జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు
జనవరి 1 నుంచి క్రమంత తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు పెడతాం. ప్రతి వారం కూడా మండలంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహించాలి. నెలలో నాలుగు క్యాంపులు నిర్వహించాలి. ఐదు నెలల్లో మళ్లీ అదే గ్రామంలో క్యాంపు నిర్వహణ సమయం వస్తుంది. దీనివల్ల సంతృప్త స్థాయిలో సేవలు అందుతాయి. ఆరోగ్య పరంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా వారి అవసరాలు తీర్చడం మన బాధ్యత.

నవంబర్‌ 9 నుంచి వై ఏపీ నీడ్స్‌ జగన్‌ పేరిట కార్యక్రమం
ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మంచి గురించి అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. గ్రామాల వారీగా ఎంత డీబీటీ ఇచ్చాం, ఎంతమంది ఎలా లబ్ధి జరిగింది అన్నదానిపై ప్రతి ఒక్కరికీ వివరాలు అందించాలి. గ్రామాల వారీగా ఏయే పథకాల ద్వారా లబ్ధిపొందారో చెప్పాలి. గ్రామాలవారీగా ఎంత మంచి జరిగిందో చెప్పాలి. ఏ పథకం ఎలా పొందాలో వారికి తెలియాలి. ఒకవేళ ఎవరికైనా ఏమైనా అందకపోతే వారికి అందించేలా చర్యలు తీసుకోవాలి. స్కూల్లో నాడు – నేడు ద్వారా వచ్చిన మార్పులు చెప్పాలి. ఆర్బీకేల్లాంటి వ్యవస్థతోపాటు, వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులు గురించి చెప్పాలి. పారదర్శకత ఏరకంగా పాటిస్తున్నామో చెప్పాలి’’ అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 MI VS GT Result Update: గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

GT vs MI Match Highlights IPL 2025 | ముంబై ఇండియన్స్ పై 36 పరుగుల తేడాతో గుజరాత్ విజయం | ABP DesamMS Dhoni Fastest Stumping vs RCB | వరుసగా రెండో మ్యాచ్ లోనూ ధోని మెరుపు స్టంపింగ్ | ABP DesamMS Dhoni Sixers vs RCB IPL 2025 | యధావిథిగా ధోనీ ఆడాడు..CSK ఓడింది | ABP DesamCSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 MI VS GT Result Update: గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
Hardik Pandya :బూతు పదంతో సాయికిషోర్‌న తిట్టిన హార్దిక పాండ్యా, సోషల్ మీడియాలో వీడియో వైరల్
బూతు పదంతో సాయికిషోర్‌న తిట్టిన హార్దిక పాండ్యా, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Operation Brahma: మయన్మార్ చేరుకున్న NDRF రెస్క్యూ బృందాల విమానాలు, ఆర్సీ, మెడికల్ టీమ్‌లను పంపిన భారత్  
మయన్మార్ చేరుకున్న NDRF రెస్క్యూ బృందాల విమానాలు, ఆర్సీ, మెడికల్ టీమ్‌లను పంపిన భారత్  
Hyderabad Metro Latest Timings: మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
US-Canada Tariff War: ట్రంప్ టారిఫ్ విధానంతో అమెరికాలో టాయిలెట్ పేపర్ కొరత!
ట్రంప్ టారిఫ్ విధానంతో అమెరికాలో టాయిలెట్ పేపర్ కొరత!
Embed widget