CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Andhrapradesh News: సీఎం జగన్ పై రాయి దాడి ఘటనకు సంబంధించి ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితున్ని ప్రశ్నించగా షాకింగ్ విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.
Shocking Facts in Attack on CM Jagan Incident: సీఎం జగన్ (CM Jagan)పై రాయి దాడి ఘటనకు సంబంధించి ఐదుగురు యువకులను అనుమానితులుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీగా చెందిన సతీష్ అలియాస్ సత్తి అనే యువకుడే సీఎంపై రాయితో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. దాడి చేసిన సమయంలో అతనితో పాటు ఉన్న నలుగురు యువకులు ఆకాష్, దుర్గారావు, చిన్నా, సంతోష్ లను సైతం సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీఎంపై పుట్ పాత్ టైల్స్ రాయి ముక్కతో దాడి చేసినట్లు తెలుస్తోంది. టైల్స్ రాయిని జేబులో వేసుకుని వచ్చి సడెన్ గా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తోన్న సమయంలో పబ్లిక్ లో ఉన్న వ్యక్తులు తీసిన వీడియోల ఆధారంగా నిందితున్ని గుర్తించినట్లు సమాచారం.
'అదే కారణమా.?'
కాగా, పోలీసు విచారణలో యువకుడు సతీష్ షాకింగ్ విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. తమకు వైసీపీ నేతలు క్వార్టర్ బాటిల్, రూ.350 ఇస్తామని ఆశ చూపి మరీ సభకు తీసుకొచ్చారని.. తీరా వచ్చాక మద్యం బాటిల్ చేతిలో పెట్టి వెళ్లిపోయారని చెప్పినట్లు సమాచారం. డబ్బులివ్వకుండా వెళ్లిపోవడంతోనే సీఎం జగన్ ను రాయితో కొట్టినట్లు పోలీసుల విచారణలో నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని సిట్ అధికారులు అధికారికంగా ధ్రువీకరించలేదు. దాడి ఘటనపై విచారణ కొనసాగుతోంది.
నారా లోకేశ్ ట్వీట్
మరోవైపు, దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 'క్వార్టర్ మేటర్...! ఇస్తానన్న రూ.350 ఇవ్వకపోతే... మండదా అక్కా! మండదా చెల్లీ!.. మండదా తమ్ముడు! మండదా అన్నా!' అని ట్వీట్ లో పేర్కొన్నారు.
క్వార్టర్ మేటర్...! ఇస్తానన్న రూ.350 ఇవ్వకపోతే...
— Lokesh Nara (@naralokesh) April 16, 2024
మండదా అక్కా!
మండదా చెల్లీ!..
మండదా తమ్ముడు!
మండదా అన్నా!#KodiKathiDrama2 #EndOfYCP#AndhraPradesh