RK Beach: ఆర్కే బీచ్ లో విషాదం.. స్నానానికి దిగి నలుగురు గల్లంతు
విశాఖ ఆర్కే బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వచ్చిన నలుగురు సముద్రంలో గల్లంతయ్యారు.
విశాఖ ఆర్కే బీచ్ లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నాన్ని తిలకించడానికి వచ్చిన నలుగురు సముద్రంలో గల్లంతయ్యారు. వారిలో ఓ యువతి, ఓ యువకుడు మృతి చెందారు. లభ్యమైన యువతి మృతదేహం.. సునీతా త్రిపాఠిగా గుర్తించారు. మరో ఇద్దరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వేర్వేరు ఘటనల్లో గల్లంతైన వారు హైదరాబాద్, ఒడిశా నుంచి విశాఖకు విహారయాత్రకు వచ్చినట్టు తెలుస్తోంది.
సికింద్రాబాద్‌కు చెందిన 8 మంది యువకులు ఆర్‌కే బీచ్‌కు చేరుకొని స్నానానికి దిగారు. పెద్ద కెరటాలు రావడంతో ఇందులో ముగ్గురు యువకులు నీటిలో మునిగిపోయారు. కొద్దిసేపటికే శివ అనే వ్యక్తిని లైఫ్ గార్డ్స్ ఒడ్డుకు తీసుకుని వచ్చారు. అయితే కొన ఊపిరితో ఉన్న శివను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. కానీ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి.. శివ మృతి చెందాడు. కె.శివ, మహ్మద్ అజీజ్ గల్లంతయ్యారు. వారికోసం గాలింపు చేపట్టారు. గల్లంతైన ఇద్దరు హైదరాబాద్ యువకుల కోసం గజ ఈతగాళ్లు, లైఫ్ గార్డ్స్ గాలింపు చేస్తున్నారు. మూడో పట్టణ సీఐ కోరాడ రామారావు నేవీ, మెరైన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
ఒడిశాలోని భద్రక్ జిల్లాకు చెందిన ఐదుగురు విద్యార్థులు సైతం ఆర్‌కే బీచ్‌కు వచ్చారు. వీరు.. స్నానం చేసేందుకు.. సముద్రంలో దిగారు. పెద్ద కెరటం నెట్టడంతో విద్యార్థిని సుమిత్రా త్రిపాఠి అనే యువతి నీటిలో మునిగిపోయింది. కొంతసమయం తర్వాత... శవమై ఒడ్డుకు చేరింది. మిగిలిన నలుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. సుమిత్రా త్రిపాఠితోపాటు.. హైదరాబాద్ యువకుడి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. విహారయాత్రకు వచ్చి.. ఇలా జరగడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది
Also Read: Vizianagaram: పోలీసునని బెదిరించి ఇద్దరు గిరిజన బాలికలపై లైంగిక దాడి... పోలీసుల అదుపులో నిందితుడు..
Also Read: Cop steals goat: న్యూ ఇయర్ పార్టీ కోసం మేకలను దొంగిలించిన పోలీస్.. చివరకు ఏమైందంటే..
Also Read: Mancherial: దొంగను బంధించేందుకు మహిళ సాహసం.. ప్యాంటు, బెల్టు పట్టుకొని లాగి.. అభినందించిన పోలీసులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి