News
News
X

Mancherial: దొంగను బంధించేందుకు మహిళ సాహసం.. ప్యాంటు, బెల్టు పట్టుకొని లాగి.. అభినందించిన పోలీసులు

దొంగను పట్టుకునే ప్రయత్నం చేయగా అతణ్ని గట్టిగా తోసేసి పారిపోయేందుకు యత్నించాడు. దీంతో మహిళ సాహసం చేసింది.

FOLLOW US: 

ఇంట్లో దొంగలు పడితే కంగారు పడకుండా ఓ మహిళ ధైర్యంగా వ్యవహరించి అతణ్ని బంధించిన ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. ఆ దొంగతనం కూడా ఓ హోంగార్డు ఇంట్లో జరిగింది. భర్త పోలీసు శాఖలో పని చేస్తున్నాడనే ఆ ధైర్యంతోనే మహిళ దొంగను పట్టుకుంది. అసలేం జరిగిందంటే.. ఇంటెలిజెన్స్‌ విభాగంలో హోం గార్డుగా పని చేస్తున్న చంద్రయ్య మంచిర్యాలలోని ఎక్బాల్‌ హైమద్‌ నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇతని భార్య భాగ్యలక్ష్మి. వీరికి ఇద్దరు కుమార్తెలు. అతని ఇంట్లో శనివారం తెల్లవారు జామున ఓ దొంగ తన ఇంటి లోపలికి చొరబడ్డాడు. చాకచక్యంగా వ్యవహరించిన అతని భార్య భాగ్యలక్ష్మి తన భర్త సాయంతో దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించింది.

శనివారం తెల్లవారుజామున సదరు మహిళ వాకిట్లో ముగ్గులు వేసి ఇంట్లోకి వెళ్లిపోయింది. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. గమనించిన చంద్రయ్య కేకలు వేస్తూ అతణ్ని పట్టుకునే ప్రయత్నం చేయగా అతణ్ని గట్టిగా తోసేసి పారిపోయేందుకు యత్నించాడు. దీంతో చంద్రయ్య పడిపోయాడు. వెంటనే భాగ్యలక్ష్మి చాకచక్యంగా వ్యవహరించింది. తన భర్త కింద పడిపోవడంతో పరిగెత్తుకొని వచ్చి దొంగ ప్యాంట్, బెల్టు పట్టుకొని గట్టిగా లాగింది. దీంతో అతను కింద పడిపోయాడు. ఇంతలో చంద్రయ్య పైకి లేచి తాడుతో అతణ్ని కట్టేశాడు.

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ నారాయణ్‌ నాయక్‌ బ్లూ కోర్ట్‌ సిబ్బందిని ఘటన స్థలానికి పంపించారు. సదరు వ్యక్తిని అరెస్టుచేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నిందితుడు ఫూటుగా మద్యం సేవించి ఉన్నాడని, దొంగతనానికి వచ్చి దొరికిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.

తన భర్త కూడా పోలీసు శాఖలోనే పని చేస్తుండడంతో ఆ ధైర్యంతోనే దొంగను నిలువరించగలిగానని భాగ్యలక్ష్మి తెలిపారు. ‘‘నిందితుడు దొంగతనం చేసేందుకే వచ్చాడు. మా ఆయన పట్టుకుంటే తోసేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. నేను వెంటనే పరుగెత్తుకుని వచ్చి దొంగ ప్యాంటు, నడుము పట్టుకుని గట్టిగా లాగాను. వెంటనే మా ఆయన లేచి తాడుతో కట్టేశాడు. నేను పట్టుకోకపోతే పారిపోయేవాడు.

Also Read: సంక్రాంతికి మరో 10 ప్రత్యేక రైళ్లు ... దక్షిణ మధ్య రైల్వే ప్రకటన

Also Read:  శ్రీకాళహస్తీశ్వరుని సేవలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్....

Also Read: వంగవీటి రాధాను పరామర్శించిన చంద్రబాబు .. రెక్కీ చేసిన వారిని పట్టుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.

Published at : 02 Jan 2022 11:20 AM (IST) Tags: mancherial news Home guard wife thieves in mancherial home guard housr intelligence bureau

సంబంధిత కథనాలు

Annamayya District News : ఓ నిర్ణయం తీసుకుని ఇంటికి తిరిగి వస్తానని, ఇద్దరు పిల్లలతో వివాహిత సూసైడ్!

Annamayya District News : ఓ నిర్ణయం తీసుకుని ఇంటికి తిరిగి వస్తానని, ఇద్దరు పిల్లలతో వివాహిత సూసైడ్!

Mancherial News : ప్రేమించిన యువతి కోసం యువకుడి పోరాటం, లవర్ ఇంటి ముందు నిరసన

Mancherial News :  ప్రేమించిన యువతి కోసం యువకుడి పోరాటం, లవర్ ఇంటి ముందు నిరసన

జగిత్యాలలో మరో చిన్నారి కిడ్నాప్, అసలేమైందంటే?

జగిత్యాలలో మరో చిన్నారి కిడ్నాప్, అసలేమైందంటే?

Mlc Anantababu : ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఎట్టకేలకు ఛార్జ్ షీట్, 88 రోజుల తర్వాత

Mlc Anantababu : ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఎట్టకేలకు ఛార్జ్ షీట్, 88 రోజుల తర్వాత

Crime News : బెదిరించడం కోసమే పెట్రోల్ కానీ తేడా కొట్టేసింది ! అంబర్ పేట కాలేజీలో జరిగింది ఇదే

Crime News : బెదిరించడం కోసమే పెట్రోల్ కానీ తేడా కొట్టేసింది ! అంబర్ పేట కాలేజీలో జరిగింది ఇదే

టాప్ స్టోరీస్

TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TS Inter Board : హైదరాబాద్ లో  విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో

Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం