News
News
X

Vizianagaram: పోలీసునని బెదిరించి ఇద్దరు గిరిజన బాలికలపై లైంగిక దాడి... పోలీసుల అదుపులో నిందితుడు..

గిరిజన బాలికల అత్యాచారం కేసు విజయనగరం జిల్లాలో సంచలనమైంది. పోలీసునని చెప్పి బెదిరించి ఇద్దరు గిరిజన బాలికలపై అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

FOLLOW US: 

పోలీసునని చెప్పి ఇద్దరు గిరిజన బాలికలపై అత్యాచారం చేశాడో మృగాడు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో సంచలనమైంది. బాలికల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. 

అసలేం జరిగింది..

న్యూ ఇయర్ వేడుకల కోసం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. “కురుపాం మండంలోని గిరిజన సంక్షేమ సోస్ట్ మెట్రిక్ బాలికల హాస్టల్ లో ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు తమ స్నేహితులతో కలిసి జియ్యమ్మవలస మండలంలోని వట్టిగెడ్డ రిజర్వాయర్‌ను చూసేందుకు శనివారం ఉదయం వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తిరిగి హాస్టల్ కు బయలుదేరారు. అదే సమయంలో చినమేరంగికి చెందిన వెలగాడ రాంబాబు అనే వ్యక్తి వీరిని చూశాడు. వెంటనే విద్యార్థినులు వద్దకు వెళ్లి తాను పోలీసునంటూ వారి వివరాలను అడిగి తెలుసుకున్నాడు. వారి ఫొటోలు, వీడియోలను తన సెల్ ఫోన్ తో చిత్రీకరించాడు.” అని పార్వతీపుపురం డీఎస్పీ సుభాష్‌ తెలిపారు. 

బాలికలను దిగబెడతానని చెప్పి...

“బాలికలు ఇద్దరితో వచ్చిన మరో ఇద్దరు విద్యార్థుల వివరాలు తీసుకుని వారిని బెదిరించి పంపించేశాడు. బాలికలు ఇద్దర్ని తాను హాస్టల్ వద్ద దింపుతానని చెప్పాడు రాంబాబు. తాను చెప్పినట్లు వినకపోతే తాను తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అనంతరం బాలికలను సమీపంలోని పామాయిల్‌తోటకు తీసుకెళ్లాడు. ఒకరి తరువాత ఒకరిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానంటూ భయపెట్టాడు. తర్వాత హాస్టల్ కు చేరుకున్న విద్యార్థినులు విషయాన్ని హాస్టల్ వార్డెన్ మండంగి సీతమ్మకు తెలియజేశారు. ఆమె వెంటనే కురుపాం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎల్విన్‌పేట సీఐ తిరుపతిరావు, కురుపాం ఎస్‌ఐ బి.శివప్రసాద్‌ హాస్టల్ కు వెళ్లి వివరాలు సేకరించారు. ఆ వివరాలను జిల్లా ఎస్పీకు అందించాం.” అని డీఎస్సీ సుభాష్ తెలిపారు. 

Also Read: న్యూ ఇయర్ పార్టీ కోసం మేకలను దొంగిలించిన పోలీస్.. చివరకు ఏమైందంటే..

సెంటిఫిక్ ఎవిడెన్స్ సేకరిస్తున్నాం...

బాధితులు చెప్పిన వివరాలు ప్రకారం పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుడు రాంబాబును అరెస్ట్ చేశామని ఎస్పీ దిపీకా పాటిల్ తెలిపారు. నిందితుడుపై ఇప్పటికే 13 కేసులున్నాయన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం రాగానే నిందితుడిని అరెస్ట్ చేశామని, కేసు దర్యాప్తు పూర్తి చేసి సెంటిఫిక్ ఎవిడెన్స్ సహాయంతో అతడికి శిక్షపడేలా చూస్తామన్నారు. పోక్సో యాక్ట్, ఐపీసీ సెక్షన్లు 376, 506 ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం బాలికలిద్దరిని వైద్య పరీక్షలు కోసం పార్వతీపురం ఆసుపత్రికి తరలించామని జిల్లా ఎస్పీ దిపీకా పాటిల్ తెలిపారు.  

Also Read: నెల్లూరులో కారు దగ్ధమైన ఘటన.. వెలుగులోకి మరిన్ని విషయాలు

నిందితుడిపై వాహనంపై పోలీసు, ప్రెస్ స్టిక్టర్లు

కురుపాంలో జరిగిన ఘటన దారుణమని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. “నిందితుడిని బాధితులైన విద్యార్థినులు గుర్తించారు. అతడిపై గతంలో కూడా పలుకేసులు ఉన్నట్లు తెలిసింది. అతడిపై అనేక కేసులతో పాటు రౌడీ షీట్ కూడా ఉంది. అతను వాడుతున్న వాహనంపై పోలీసు, ప్రెస్ అని స్టిక్టర్లు ఉన్నాయి. నిందితుడు తప్పు చేయడానికి వ్యవస్థలను సైతం వాడుకున్నాడు. పోలీసులు ఈ విషయంలో వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకున్నారు. బాధితులకు పూర్తిగా సహాయ సహాకారాలు అందిస్తాం.” అని పుష్ప శ్రీవాణి చెప్పారు.

Also Read: రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ ఎస్సై మృతి... కాళ్లపారాణి ఆరక ముందే తిరిగిరాని లోకాలకు...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 02 Jan 2022 04:20 PM (IST) Tags: Crime News vizianagaram crime news minor girls sexually abused kurupam incident

సంబంధిత కథనాలు

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు !  విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

Crime News : గజ్జెల శబ్దం - గుప్త నిధులు ! ఇంటిని తవ్వించేసుకున్నాడు !

Crime News : గజ్జెల శబ్దం - గుప్త నిధులు !  ఇంటిని తవ్వించేసుకున్నాడు !

జైలుకు చేరని సిక్కోలు క్రైం కథలు- భయం గుప్పెట్లో ప్రజలు

జైలుకు చేరని సిక్కోలు క్రైం కథలు- భయం గుప్పెట్లో ప్రజలు

Srikakulam Crime Stories: కంచికి చేరని క్రైం కథలు, ఏళ్ల తరబడి కొనసాగుతున్న దర్యాప్తులు!

Srikakulam Crime Stories: కంచికి చేరని క్రైం కథలు, ఏళ్ల తరబడి కొనసాగుతున్న దర్యాప్తులు!

Karnataka Accident : కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి

Karnataka Accident : కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి

టాప్ స్టోరీస్

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ-  పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

Milk Price : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు

Milk Price  : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు