Corona Update: ఏపీలో కొత్తగా 165 కరోనా కేసులు.. వైరస్ కారణంగా ఇద్దరు మృతి
ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 24,219 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 165 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కొత్తగా 165 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కొత్తగా నెల్లూరులో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. కరోనా బారి నుంచి నిన్న 130 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,260 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
#COVIDUpdates: 02/01/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 2, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,74,591 పాజిటివ్ కేసు లకు గాను
*20,58,834 మంది డిశ్చార్జ్ కాగా
*14,497 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,260#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/i4e7Oa9bLL
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 1500 మార్కు దాటింది. ప్రస్తుతం 1525 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్రలో టాప్‌లో ఉంది. రాజస్థాన్‌లో కూడా ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరిగాయి.
మరోవైపు కరోనా వ్యాప్తి కూడా భారీగా పెరిగింది. కొత్తగా 27,553 కరోనా కేసులు నమోదుకాగా 284 మంది మృతి చెందారు. 9,249 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,22,801కి చేరింది.
సోమవారం నుంచి 15-18 ఏళ్ల వయస్సు వారికి టీకాలు
కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో సోమవారం భారత్ మరో మైలురాయిని చేరుకోనుంది. దేశవ్యాప్తంగా సోమవారం నుంచి 15-18 ఏళ్ల వయస్సు వారికి టీకాలు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.15-18 ఏళ్ల వయస్సు వారికోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సూచించారు.
దేశంలో వయోజనులకు కొవాగ్జిన్తో పాటు కొవిషీల్డ్, స్పుత్నిక్ వీ టీకాలను అందిస్తున్నారు. కానీ 15-18 ఏళ్ల వయస్సు వారికి కొవాగ్జిన్ టీకా మాత్రమే అందుబాటులో ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాల్లో ఇది స్పష్టంగా ఉంది. కనుక ఈ వ్యాక్సిన్ పంపిణీ విషయంలో గందరగోళం తలెత్తకుండా చూసుకోవాలని మాండవీయ అన్నారు.
Also Read: Covid Vaccination: సోమవారం నుంచి 15-18 ఏళ్ల వారికి టీకా.. ఈ విషయంలో జాగ్రత్త!
Also Read: WB Covid Curb: ఆంక్షల వలయంలో రాష్ట్రాలు.. అక్కడ విద్యాసంస్థలు బంద్, వర్క్ ఫ్రమ్ హోం అమలు
Also Read: Omicron Cases in India: దేశంలో జెట్ స్పీడుతో ఒమిక్రాన్ వ్యాప్తి.. 1500 మార్కు దాటిన కేసులు