Covid Vaccination: సోమవారం నుంచి 15-18 ఏళ్ల వారికి టీకా.. ఈ విషయంలో జాగ్రత్త!
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి 15-18 ఏళ్ల వయస్సు వారికి కరోనా టీకా ఇవ్వనున్నారు.
కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో సోమవారం భారత్ మరో మైలురాయిని చేరుకోనుంది. దేశవ్యాప్తంగా సోమవారం నుంచి 15-18 ఏళ్ల వయస్సు వారికి టీకాలు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.15-18 ఏళ్ల వయస్సు వారికోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సూచించారు.
Union Ministry Dr. Mansukh Mandaviya reviews public health preparedness for COVID19 and vaccination progress with States/UTs.
— ANI (@ANI) January 2, 2022
"We've to put up a strong fight against COVID earlier & this learning must be used to re-focus on efforts against Omicron variant," he says.
(file pic) pic.twitter.com/jR5hFir3cn
దేశంలో వయోజనులకు కొవాగ్జిన్‌తో పాటు కొవిషీల్డ్, స్పుత్నిక్ వీ టీకాలను అందిస్తున్నారు. కానీ 15-18 ఏళ్ల వయస్సు వారికి కొవాగ్జిన్ టీకా మాత్రమే అందుబాటులో ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాల్లో ఇది స్పష్టంగా ఉంది. కనుక ఈ వ్యాక్సిన్ పంపిణీ విషయంలో గందరగోళం తలెత్తకుండా చూసుకోవాలని మాండవీయ అన్నారు.
ఏర్పాట్లు పూర్తి..
పిల్లలకు టీకాలు అందించేందుకు దిల్లీ, ముంబయిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఆటవస్తువులు, పుస్తకాలు ఏర్పాటు చేశారు. టీకా వేసుకున్న వారు ఇండోర్ గేమ్స్ ఆడేందుకు ప్రత్యేక గదిని కేటాయించారు. కొవాగ్జిన్ తీసుకున్నవారికి రిటర్న్ గిఫ్టులు కూడా ఇచ్చేందుకు లంచ్ బాక్సులు, వాటర్ బాటిళ్లు కొనుగోలు చేశారు.
ఒమిక్రాన్ వ్యాప్తి..
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 1500 మార్కు దాటింది. ప్రస్తుతం 1525 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్రలో టాప్‌లో ఉంది. రాజస్థాన్‌లో కూడా ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరిగాయి.
మరోవైపు కరోనా వ్యాప్తి కూడా భారీగా పెరిగింది. కొత్తగా 27,553 కరోనా కేసులు నమోదుకాగా 284 మంది మృతి చెందారు. 9,249 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,22,801కి చేరింది.
Also Read: PM Modi Meerut Visit: ఎన్నికలకు ముందు రూ.700 కోట్లతో స్పోర్ట్స్ యూనివర్సిటీకి మోదీ శంకుస్థాపన
Also Read: UP Election 2022: తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో యోగి.. అయోధ్య నుంచేనా పోటీ!
Also Read: Omicron Cases in India: దేశంలో జెట్ స్పీడుతో ఒమిక్రాన్ వ్యాప్తి.. 1500 మార్కు దాటిన కేసులు
Also Read: Delhi HC on Marriage: 'అలా చెప్పి పెళ్లి చేయడం మోసమే..' దిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి