![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Omicron Cases in India: దేశంలో జెట్ స్పీడుతో ఒమిక్రాన్ వ్యాప్తి.. 1500 మార్కు దాటిన కేసులు
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1525కు చేరింది. కొత్తగా 27,553 కరోనా కేసులు నమోదయ్యాయి.
![Omicron Cases in India: దేశంలో జెట్ స్పీడుతో ఒమిక్రాన్ వ్యాప్తి.. 1500 మార్కు దాటిన కేసులు Omicron In India reports 1525 new cases Rajasthan Witnesses Sudden Surge Check Andhra Pradesh, Telangana State-Wise List Omicron Cases in India: దేశంలో జెట్ స్పీడుతో ఒమిక్రాన్ వ్యాప్తి.. 1500 మార్కు దాటిన కేసులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/02/3dfb7186897ff037f8c1768386ec63e0_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 1500 మార్కు దాటింది. ప్రస్తుతం 1525 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్రలో టాప్‌లో ఉంది. రాజస్థాన్‌లో కూడా ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరిగాయి.
మరోవైపు కరోనా వ్యాప్తి కూడా భారీగా పెరిగింది. కొత్తగా 27,553 కరోనా కేసులు నమోదుకాగా 284 మంది మృతి చెందారు. 9,249 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,22,801కి చేరింది.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కొత్తగా 6 ఒమిక్రాన్ కేసులే నమోదయ్యాయి. కానీ కరోనా కేసులు మాత్రం భారీగా పెరిగాయి. కొత్తగా 9,170 కరోనా కేసులు నమోదుకాగా ఏడుగురు మృతి చెందారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కారణంగా గత 11 రోజులుగా మహారాష్ట్రలో కరోనా కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 66,87,991కి చేరింది.
రాజస్థాన్..
రాజస్థాన్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఒకేసారి పెరిగింది. కొత్తగా 52 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 121కి చేరింది. కొత్తగా నమోదైన 52 ఒమిక్రాన్ కేసుల్లో 38 జైపుర్‌లోనే నమోదయ్యాయి. ప్రతాప్‌గఢ్, సిరోహి, బికనేర్‌లో మూడు చొప్పున నమోదుకాగా జోధ్‌పుర్‌లో రెండు కేసులు వెలుగుచూశాయి. అజ్మేర్, సికర్, భిల్వార్‌లో ఒక్కో కేసు నమోదయ్యాయి.
ఇందులో 9 మంది విదేశాల నుంచి వచ్చారు. మరో నలుగురు విదేశీ ప్రయాణికులతో కాంటాక్ట్‌లో ఉన్నవారు కాగా మరో 12 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారని అధికారులు తెలిపారు. ఆర్‌యూహెచ్‌ఎస్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఒమిక్రాన్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కొత్తగా 301 కరోనా కేసులు నమోదయ్యాయి.
గుజరాత్..
గుజరాత్‌లో కొత్తగా 23 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 136కు చేరింది.
Also Read: Delhi HC on Marriage: 'అలా చెప్పి పెళ్లి చేయడం మోసమే..' దిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)