![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
UP Election 2022: తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో యోగి.. అయోధ్య నుంచేనా పోటీ!
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
![UP Election 2022: తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో యోగి.. అయోధ్య నుంచేనా పోటీ! UP Election 2022: CM Yogi Adityanath Confirms Contesting Assembly Polls For First Time, Constituency Not Decided Yet UP Election 2022: తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో యోగి.. అయోధ్య నుంచేనా పోటీ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/30/97d9e1beed0bcaccad969bb578218f86_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రానున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. అయితే యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.
ఎక్కడి నుంచి?
యోగి ఆదిత్యనాథ్.. ఈ ఎన్నికల్లో అయోధ్య లేదా మధురా నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన సొంత నియోజకవర్గమైన గోరఖ్‌పుర్ నుంచి కూడా బరిలోకి దిగే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్.. యూపీ శాసనమండలి సభ్యునిగా ఉన్నారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు.
ఇదే అజెండా..
2017 ఎన్నికల్లో గత ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా ప్రచారం చేసి గెలిచామని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ ఎన్నికల్లో తమ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధే ప్రచార అజెండాగా ముందుకెళ్తున్నామన్నారు.
नव वर्ष की हार्दिक बधाई व शुभकामना!
— Akhilesh Yadav (@yadavakhilesh) January 1, 2022
अब बाइस में ‘न्यू यूपी’ में नयी रोशनी से नया साल होगा
300 यूनिट घरेलू बिजली फ़्री व सिंचाई बिल माफ़ होगा
नव वर्ष सबको अमन-चैन, ख़ुशहाली दे। सपा सरकार आयेगी और 300 यूनिट फ़्री घरेलू बिजली व सिंचाई की बिजली मुफ़्त दिलवाएगी। #बाइस_में_बाइसिकल pic.twitter.com/8RadolTql5
300 యూనిట్లు ఉచిత కరెంటు హామీ ఇచ్చిన అఖిలేశ్ యాదవ్‌పై యోగి విమర్శలు చేశారు. 2017కు ముందు కేవలం ఐదు జిల్లాలకే విద్యుత్ సరఫరా ఉండేదని ఆరోపించారు.
Also Read: Omicron Cases in India: దేశంలో జెట్ స్పీడుతో ఒమిక్రాన్ వ్యాప్తి.. 1500 మార్కు దాటిన కేసులు
Also Read: Delhi HC on Marriage: 'అలా చెప్పి పెళ్లి చేయడం మోసమే..' దిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)