WB Covid Curb: ఆంక్షల వలయంలో రాష్ట్రాలు.. అక్కడ విద్యాసంస్థలు బంద్, వర్క్ ఫ్రమ్ హోం అమలు

బంగాల్‌లో సోమవారం నుంచి జనవరి 15 వరకు ఆంక్షలు విధించింది సర్కార్. కరోనా వ్యాప్తి పెరుగుతోన్న కారణంగా ఈ మేరకు ప్రకటించింది.

FOLLOW US: 

దేశంలో కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోన్న కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షల బాట పట్టాయి. తాజాగా బంగాల్ కూడా ఆ జాబితాలో చేర్చింది. వైరస్ విజృంభణను అడ్డుకునేందుకు కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు దీదీ సర్కార్ సిద్ధమైంది.

" ప్రస్తుతం నెలకొన్న కొవిడ్ సంక్షోభం, ఒమిక్రాన్ వ్యాప్తిపై సమీక్ష నిర్వహించిన అనంతరం పలు ఆంక్షలను విధించేందుకు రాష్ట్ర విపత్తు కార్యనిర్వాహక కమిటీ సూచించింది. వైరస్ వ్యాప్తి రేటు అధికమవుతోన్న కారణంగా ఈ ఆంక్షలు తప్పనిసరి అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.                                     "
-  బంగాల్ సర్కార్

సోమవారం నుంచి జనవరి 15 వరకు ఈ ఆంక్షలు అమలు కానున్నట్లు బంగాల్ సర్కార్ ప్రకటించింది.

ఇవే ఆంక్షలు..

 1. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు అన్నింటినీ వెంటనే మూసివేయాలి. 50 శాతం ఉద్యోగులతో అధికారిక కార్యకలాపాలు మాత్రమే నిర్వహించాలి.  
 2. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ 50% ఉద్యోగులతోనే పనిచేయాలి. వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని వీలైనంత ఎక్కువ వినియోగించాలి. 
   
 3.  స్విమ్మింగ్ పూల్స్, స్పాస్, జిమ్‌లు, బ్యూటీ పార్లర్లు, సెలూన్లు వంటి వాటిని మూసివేయాలి. 

 4. ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, జూలు, పర్యటక ప్రాంతాలను మూసివేయాలి. 

 5. షాపింగ్ మాల్స్, మార్కెట్ ప్రాంతాలు 50 శాతం కంటే ఎక్కువ మంది వినియోగదారులు లేకుండా నడపాలి. రాత్రి 10 వరకు మాత్రమే వీటికి అనుమతి. 
 6. రెస్టారెంట్లు, బార్లు 50% సామర్థ్యంతో రాత్రి 10 గంటల వరకు నడపాలి. 
 7. సనిమా హాళ్లు, థియేటర్లు 50% సీటింగ్ సామర్థ్యంతో నడుపుకోవచ్చు. వీటికి కూడా రాత్రి 10 గంటల వరకే అనుమతి. 

 8. సమావేశాలు నిర్వహించుకోవాలంటే 200 మంది కంటే ఎక్కువ మంది ఉండకూడదు. లేదా 50 శాతం సామర్థ్యాన్ని మించకూడదు. 
 9. ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో 50 మంది కంటే ఎక్కువ ఉండకూడదు. 

 10. వివాహం సహా సంబంధిత ఫంక్షన్లలో 50 మంది కంటే ఎక్కువ ఉండకూడదు. 

 11. అంతిమయాత్ర, అంత్యక్రియలకు 20 మంది కంటే ఎక్కువ మంది వెళ్లకూడదు. 

 12. లోకల్‌ ట్రైన్లు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో రాత్రి 7 గంటల వరకు మాత్రమే నడపాలి. 

 13. మెట్రో సర్వీసులు మాత్రం 50% సీటింగ్ సామర్థ్యంతో ప్రస్తుత ఉన్న సమయం వరకు నడుపుకోవచ్చు. 

 14. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ఎలాంటి ప్రజా, ప్రైవేట్ రవాణాకు అనుమతి లేదు. అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తారు.

బంగాల్ కేసులు.. 

బంగాల్‌లో కొత్తగా 4,512  కరోనా కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనాతో మరణించారు. ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధరణైంది. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 16కు చేరింది.

Also Read: UP Election 2022: తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో యోగి.. అయోధ్య నుంచేనా పోటీ!

Also Read: Omicron Cases in India: దేశంలో జెట్ స్పీడుతో ఒమిక్రాన్ వ్యాప్తి.. 1500 మార్కు దాటిన కేసులు

Also Read: Delhi HC on Marriage: 'అలా చెప్పి పెళ్లి చేయడం మోసమే..' దిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 02 Jan 2022 06:01 PM (IST) Tags: coronavirus COVID-19 West Bengal Coronavirus Restrictions omicron variant omicron cases West Bengal govt Covid-19 Restrictions

సంబంధిత కథనాలు

Sleep With Lights: రాత్రివేళ లైట్స్ వేసుకుని నిద్రపోతున్నారా? ఈ సమస్యలు తప్పవు!

Sleep With Lights: రాత్రివేళ లైట్స్ వేసుకుని నిద్రపోతున్నారా? ఈ సమస్యలు తప్పవు!

African Snail: వామ్మో నత్తలు, వేలాది మంది క్వారంటైన్‌కు - ఊరు మొత్తం నిర్బంధం!

African Snail: వామ్మో నత్తలు, వేలాది మంది క్వారంటైన్‌కు - ఊరు మొత్తం నిర్బంధం!

Tips for Cold: జలుబు వేదిస్తోందా? ఈ సింపుల్ చిట్కాలతో చిటికెలో ఉపశమనం

Tips for Cold: జలుబు వేదిస్తోందా? ఈ సింపుల్ చిట్కాలతో చిటికెలో ఉపశమనం

Fenugreek seeds: మెంతులతో మెరుపు తీగలా మారిపోతారు, బరువు తగ్గేందుకు ఇలా చేయండి

Fenugreek seeds: మెంతులతో మెరుపు తీగలా మారిపోతారు, బరువు తగ్గేందుకు ఇలా చేయండి

Swallowing Mucus: కఫాన్ని మింగేస్తే ఏం జరుగుతుంది? శ్లేష్మం ఎందుకు ఏర్పడుతుంది?

Swallowing Mucus: కఫాన్ని మింగేస్తే ఏం జరుగుతుంది? శ్లేష్మం ఎందుకు ఏర్పడుతుంది?

టాప్ స్టోరీస్

IND vs ENG 5th Test: ఇంగ్లండ్‌పై బుమ్రా బాంబ్ - పట్టుబిగిస్తున్న భారత్!

IND vs ENG 5th Test: ఇంగ్లండ్‌పై బుమ్రా బాంబ్ - పట్టుబిగిస్తున్న భారత్!

New Brezza Vs Old Vitara Brezza: కొత్త బ్రెజా, పాత బ్రెజాల మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారా? వీటిలో ఏది బెస్ట్ కారో చూసేయండి మరి!

New Brezza Vs Old Vitara Brezza: కొత్త బ్రెజా, పాత బ్రెజాల మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారా? వీటిలో ఏది బెస్ట్ కారో చూసేయండి మరి!

Whatsapp New Feature: వాట్సాప్ మోస్ట్ అవైటెడ్ ఫీచర్ త్వరలోనే - ఇక ఆన్‌లైన్‌లో ఉన్నప్పటికీ!

Whatsapp New Feature: వాట్సాప్ మోస్ట్ అవైటెడ్ ఫీచర్ త్వరలోనే - ఇక ఆన్‌లైన్‌లో ఉన్నప్పటికీ!

Bandi Sanjay On KCR: దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చి చూపించు- కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్

Bandi Sanjay On KCR: దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చి చూపించు- కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్