Telangana Rains: అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. రైతులు, ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి సూచనలు
గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల పట్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.
![Telangana Rains: అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. రైతులు, ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి సూచనలు TS Minister Errabelli Dayakar Rao Alerts Officials, People and Farmers over Unseasonal Rains In Telangana Telangana Rains: అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. రైతులు, ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి సూచనలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/16/ec46a7b6cb1a569e0055589b58d2710c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Errabelli Dayakar Rao: వరంగల్: గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు చోట్ల, వరంగల్ ఉమ్మడి జిల్లా, పాలకుర్తి నియోజకవర్గంలో కురుస్తున్న అకాల వర్షాల పట్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. అధికారులతో మాట్లాడి తాజా పరిస్థితులను సమీక్షించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
అనుకోని విధంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి అన్నారు. ఇప్పటికే ప్రజా ప్రతినిధులు ఆయా చోట్ల ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నారు. అలాగే, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రైతులు ధాన్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, బయట ధాన్యం ఆరబోస్తే నీటిపాలు అవుతాయని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను మరింత అప్రమత్తం చేసి, అవసరమైతే రక్షణ చర్యలు తక్షణమే చేపట్టాలన్నారు. ప్రజలు ప్రస్తుత వాతావరణానికి తగ్గట్లుగా వ్యవహరించాలని కోరారు. పెద్దలు, పిల్లలను బయటకు రానివ్వవద్దని సూచించారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
Also Read: గొంతులు కోస్తున్న చైనా మాంజా.. నిషేధం విధించినా జోరుగా అమ్మకాలు ! ఇంకెంత మంది ప్రాణాలు పోవాలి ?
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల పెద్ద వర్షాలు, మరికొన్ని చోట్ల వడగండ్లు కూడా కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం.. జనవరి 16న నుంచి రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వర్షాలకు సంబంధించి ఎలాంటి హెచ్చరిక జారీ చేయలేదు. ఈ నెల 19వ తేదీ వరకూ వాతావరణం పొడిగానే ఉంటున్నట్లుగా హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అదికారులు అంచనా వేశారు.
Also Read: D.Srinivas: కాంగ్రెస్ లోకి ధర్మపురి శ్రీనివాస్ రీ ఎంట్రీ.. 'కారు' దిగి 'చేయి' పట్టుకునేది ఎప్పుడంటే!
Also Read: Weather Updates: ఏపీకి తప్పని కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాల్లో ఉరుములు కూడా.. తెలంగాణలో వెదర్ ఇలా..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)