D.Srinivas: కాంగ్రెస్ లోకి ధర్మపురి శ్రీనివాస్ రీ ఎంట్రీ.. 'కారు' దిగి 'చేయి' పట్టుకునేది ఎప్పుడంటే!
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ సొంతగూటికి రానున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్టు సమాచారం.
![D.Srinivas: కాంగ్రెస్ లోకి ధర్మపురి శ్రీనివాస్ రీ ఎంట్రీ.. 'కారు' దిగి 'చేయి' పట్టుకునేది ఎప్పుడంటే! dharmapuri srinivas will join in congress party on 24th january D.Srinivas: కాంగ్రెస్ లోకి ధర్మపురి శ్రీనివాస్ రీ ఎంట్రీ.. 'కారు' దిగి 'చేయి' పట్టుకునేది ఎప్పుడంటే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/16/b561ebe064505c86cd13247ea6154db9_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నిజామాబాద్ కు చెందిన కీలక నేత టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ కాంగ్రెస్ గూటికి రానున్నారు. ఇందు కోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. జనవరి 24వ తేదీన సోనియాగాంధీ సమక్షంలో డీఎస్ కాంగ్రెస్‌లోకి చేరేందుకు అన్నీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. కొంతకాలంగా టీఆర్ఎస్ లో ఆయన ఇమడలేకపోతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ లోనే డీఎస్ రాజకీయంగా ఎదిగారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలోనే.. డీఎస్ టీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు కూడా అయిన విషయం తెలిసిందే. డీఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మినిస్టర్ గా, పీసీసీ చీఫ్‌గా చేశారు. 2004లో పీసీసీ చీఫ్ గా ఆయన ఉన్న సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. విభజన అనంతరం 2014లో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత డీ.శ్రీనివాస్ టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ లో తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానించారని డీఎస్ అప్పుడు ఆరోపణలు చేశారు.
అయితే టీఆర్ఎస్ లోకి చేరిన కొంతకాలనికి కేసీఆర్, డీఎస్ కు మధ్య దూరం పెరిగింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు సైతం డీఎస్ పై ఫిర్యాదులు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు గుప్పించారు. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు డీఎస్.. కేసీఆర్ కలుద్దామనుకున్నా.. అపాయింట్ మెంట్ దొరకలేదు. ఇక అప్పటి నుంచి టీఆర్ఎస్ తో దూరం ఎక్కువైనట్టు కనిపించింది. రాజ్యసభ సభ్యుడిగా మాత్రం కొనసాగుతూనే ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. ఇటీవలే.. రేవంత్ రెడ్డి, కుసుమ్ కుమార్ డీఎస్ ఇంటికి వెళ్లి కలిశారు.
Also Read: Hyderabad MMTS: 36 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు.. కారణం ఏంటంటే
Also Read: Telangana Schools: ఓమిక్రాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)