Chaina Manja Murder : గొంతులు కోస్తున్న చైనా మాంజా.. నిషేధం విధించినా జోరుగా అమ్మకాలు ! ఇంకెంత మంది ప్రాణాలు పోవాలి ?
చైనా మంజా దారం బైక్‌పై వెళ్తున్న వ్యక్తి గొంతును కట్ చేసేసింది. దీంతో ఆ వ్యక్తి చనిపోయాడు. నిషేధం విధించినా జోరుగా చైనా మాంజాను అమ్మేస్తున్నారు. ఇప్పుడీ వ్యక్తి మరణానికి కారకులెవరు ? బాధ్యత ఎవరిది ?
సంక్రాంతి పండుగ వచ్చిందంటే పతంగుల వేడుక నిర్వహించుకోవడం సహజమే. కానీ ఈ పండుగలోనూ చొరబడిన చైనా పక్షులకే మనుషుల పీకలనూ తేగ్గోస్తోంది. దానికి సాక్ష్యం.. సంక్రాంతి పండుగల రోజే మంచిర్యాలలో చోటు చేసుకున్న ఘటన. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల నుండి ద్విచక్ర వాహనం పై లక్షెట్టిపేట వైపు వస్తున్న వ్యక్తికి ఎగురవేస్తున్న తెగిన గాలిపటం మాంజదారం గొంతుకు అడ్డం పడింది. సున్నితంగా గొంతును కట్ చేసుకుంటూ వెళ్లిపోయింది. గొంతు తెగి అతిగా రక్తస్రావం కావడం తో వ్యక్తి అక్కడి కక్కడే మృతి చెందాడు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలానికి చెందిన వసరత్ భీమయ్య గా మృతుడ్ని గుర్తించారు. ఇది అత్యంత భయంకరమైన హత్య లాంటిదే. దీనికి కారణం చైనా మాంజానే. చైనా మాంజాను ఎప్పుడో నిషేధించారు. అయినా అక్రమంగా అమ్ముతూనే ఉన్నారు. ఇలా ప్రాణాలు పోవడానికి కారణం అవుతూనే ఉన్నారు.
Also Read: హేమమాలిని ప్లేస్‌లోకి కంగనా ! రాజకీయ నేతలూ బ్రాండ్ అంబాసిడర్లను మార్చేస్తారా ?
మన సంక్రాంతి..చైనాకు పతంగుల పండుగ.. !
సంక్రాంతి సందర్భంగా చైనాలో తయారవుతున్న గాలిపటాలు- పతంగ్‌లు-, వాటిని ఎగుర వేయడానికి అవసరమైన చైనా దారం మాంజా వెల్లువలా దిగుమతి అవుతూ ఉంటాయి. చైనానుంచి వస్తున్న ప్లాస్టిక్ దారం పక్షుల గొంతులను పావురాల గొంతులను కోస్తోందని 2013నుంచి ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. ఈ దారం తగిలి గాయపడిన బాలబాలికలకు నెలల తరబడి ఆ పుండ్లు మానడం లేదని తేలింది. చైనా మాంజా దారంతో గాలిపటాలు బాగా ఎగురవేయవచ్చన్న ఉద్దేశంతో జనం ఎగబడి కొంటున్నారు. ఈ ప్లాస్టిక్ చైనా దారంలో గాజుముక్కలను ఇతర రసాయన విషాలను కలుపుతున్నారు! అందువల్ల ఈ దారం కత్తిలాగా మారుతోంది. "పతంగ్"లను ఎగురవేసేవారు మిగిలినవారి గాలి పటాలకంటె ఎత్తున ఎగరాలని భావింస్తూంటారు. పోటీపడి పైకి లేచే ఇతరుల గాలిపటాలను కూల్చివేయడం ఆటలో భాగమైపోయింది. అందుకే చైనా మాంజాను కొనేందుకు కొంత మంది ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read: గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి యోగి పోటీ.. యూపీ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ !
ఆరేళ్ల క్రితమే చైనా మాంజా నిషేధం !
2016 జనవరిలో తెలంగాణ ప్రభుత్వం చైనా మాంజా వాడకాన్ని, అమ్మకాన్ని, నిలువ ఉంచడాన్ని నిషేధించింది. ఈ దారం వల్ల పక్షులు, పావురాలు బలికావడం, బాలబాలికలు గాయపడడం నిజమని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు కూడ ఈ దారాన్ని నిషేధించాయి. 2017 జూలైలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్- ఎన్‌జిటి దేశవ్యాప్తంగా చైనా మాంజాను నిషేధించింది. కానీ ప్రతి ఏడాది మకర సంక్రాంతికి ముందు మాంజాతోపాటు గాలిపటాలు కూడ చైనానుండి వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వ్యవస్థలు పూర్తి స్థాయిలో పని చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
ఎన్నో విషాదాలు .. అయినా మేల్కొనని యంత్రాంగం
చైనా మాంజాను ప్లాస్టిక్ దారానికి గాజుపొడి అద్ది తయారు చేయటంతో గాలిపటం ఎగురవేసే వారికి, పక్కనున్న వారి చేతులకూ గాయాలవటంతో పాటు చెట్లకు, కరెంట్ పోల్స్ లకు చిక్కుకోవటంతో చిక్కుకోవడంతో మాంజాకు తగిలే పక్షులు, జంతువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. అంతేకాదు..రోడ్లపై బైక్ లపై వెళ్లేవారికి గాల్లో వేలాడుతు వచ్చిన ఈ మాంజాతో గొంతుకలు కట్ అయిపోయిన సందర్భాలు కూడా చాలానే జరిగాయి. ఈ క్రమంలో మనుషుల ప్రాణాలకు కూడా ముప్పుగా ఈ చైనా మాంజా వుంది. మంచిర్యాలలో అదే జరిగింది. గతంలో ఢిల్లీకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడి కుమారుడికి ఇలాంటి ప్రమాదం జరగడంతో అతడు కోర్టు పిటీషన్ వేసిన ప్రమాదానికి కారణాలను కోర్టు సబ్మిట్ చేశాడు. ఈ పిటీషన్ పై విచారించిన కోర్టు చైనా మాంజా నిషేధించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ చైనా మాంజా వినియోగంతో పక్షలు, జంతువులతో పాటు మనుషుల ప్రాణాలకు కూడా ప్రమాదంగా తయారయ్యింది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి చైనా మంజాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా వుంది. ఎన్ని న్యాయస్థానాలు ఆదేశించినా పట్టించుకోకపోవడంతో పక్షులే కాదు.. మనుషుల ప్రాణాలు కూడాపోతున్నాయి.
Also Read: యూపీ సీఎంగా తొలి ప్రాధాన్యత ఎవరికి?.. ABP- సీ ఓటర్ సర్వే ఫలితాలు ఇవే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి