![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
BJP Candidates List 2022 : గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి యోగి పోటీ.. యూపీ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ !
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. సీఎం యోగి .. సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్ అర్బన్ నుంచే పోటీ చేస్తారు
ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేదానిపై జరుగుతున్న చర్చకు పుల్‌స్టాప్ పెట్టారు ఆ పార్టీ నేతలు. తొలి విడత ఎన్నికలు జరగనున్న గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి ఆదిత్యనాథ్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. బీజేపీ తమ అభ్యర్థులను తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. గోరఖ్ పూర్ అర్బన్ స్థానం నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరును ప్రకటించారు. తొలి దశ ఎన్నికలు జరగనున్న 58 స్థానాలకు గాను 57 మంది అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. రెండో దశ ఎన్నికల్లో 55 స్థానాలకు గాను 38 మంది అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది.
Uttar Pradesh | CM Yogi Adityanath to contest UP Polls from Gorakhpur: BJP pic.twitter.com/AhVZojoOLt
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2022
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ లు విడుదల చేశారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సిరతు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే ఆయన గతంలో గోరఖ్‌పూర్ నుంచే ఎంపీగా గెలుస్తూ వచ్చారు. అక్కడి సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పుడే సీఎంగాబాధ్యతలు చేపట్టారు.
Also Read: యూపీ సీఎంగా తొలి ప్రాధాన్యత ఎవరికి?.. ABP- సీ ఓటర్ సర్వే ఫలితాలు ఇవే!
తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ పొత్తు పెట్టుకుని పోటీ చేయడంతో సీఎం సిట్టింగ్ సీటు అయినప్పటికీ బీజేపీ ఓడిపోయింది. తర్వాత సాధారణ ఎన్నికల్లో మాత్రం మళ్లీ గోరఖ్‌పూర్ నుంచి భోజ్‌పురి నటుడు రవికిషన్‌ను నిలబెట్టి విజయం సాధించారు. అచ్చి వచ్చిన నియోజకవర్గం కావడంతో గోరఖ్‌పూర్ నుంచే ఆదిత్యనాథ్ బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇంతకు ముందు ఆయన అయోధ్య నుంచి బరిలోకి దిగుతారన్న ప్రచారం జరిగింది.
Also Read: UP Election 2021: 'యూపీ ఎలక్షన్లు 2024 సాధారణ ఎన్నికలకు సెమీస్ కావు'
యూపీలో మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏడు దశల పోలింగ్‌లో తొలి విడత పోలింగ్ ఫిబ్రవరి 10న జరగనుంది. గత ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 303 స్థానాలు గెలుచుకుని తిరుగులేని ఆధిక్యత సాధించింది. అప్పటి వరకూ అధికార పార్టీగా ఉన్న సమాజ్ వాదీ పార్టీకి 49 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు సమాజ్ వాదీ బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది .
Also Read: పంజాబ్ ఎన్నికల్లో భాజాపా- కెప్టెన్ దోస్తీ.. 101 శాతం విజయం తమదేనని ధీమా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)