Kangana Roads : హేమమాలిని ప్లేస్‌లోకి కంగనా ! రాజకీయ నేతలూ బ్రాండ్ అంబాసిడర్లను మార్చేస్తారా ?
నున్నటి రోడ్లు నిర్మిస్తామని చెప్పడానికి ఉదాహరణగా నిన్నటి వరకూ హేమమాలి బుగ్గల్ని చెప్పే నేతలు ఇప్పుడు రూటు మార్చారు. కంగనను ఉదాహరణగా చూపిస్తున్నారు.
హేమమాలిని బుగ్గలంతా నున్నగా రోడ్లను నిర్మిస్తామని జమానా కింద లాలూ ప్రసాద్ యాదవ్ జోకేస్తే చాలా మంది నవ్వారు.. కొంత మంది ఫెమినిస్టులు సీరియస్ అయ్యారు. అది కాంప్లిమెంటో లేకపోతే అనుచితమైన వ్యాఖ్యో ఇంత వరకూ ఎవరూ డిసైడ్ చేయలేకపోయారు. అయితే లాలూ యాదవ్ అలాంటి రోడ్లను నిర్మించారో లేదో తెలియదు కానీ ప్రజలకు మాత్రం మంచి రోడ్లు నిర్మించాలంటే ఉదాహరణగా హేమాలిని బుగ్గలే కనిపిస్తూ వచ్చాయి. ఇటీవల కూడా కొంత మంది నేతలు హేమమాలిని బగ్గల్నే ఆదర్శంగా చూపించారు. మహారాష్ట్ర మంత్రి సీనియర్ శివసేన నాయకుడు గులాబ్రావ్ పాటిల్ తన నియోజకవర్గంలోని రోడ్లను హేమా మాలిని చెంపలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
Also Read: గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి యోగి పోటీ.. యూపీ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ !
కానీ ఇప్పుడు హేమమాలినికి బదులుగా కంగనానికి చూపించడం ప్రారంభించారు కొంత మంది ఎమ్మెల్యేలు. జార్ఖండ్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఇర్ఫాన్ అన్సారీ తన నియోజకవర్గం జమ్తారాలో సరైన రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆయన గెలిచి చాలా కాలం అయింది. రోడ్లేవీ సారు అని ప్రజల్ని అడుగుతున్నారు. ఆయన దానికి సమాధానంగా అదిగో.. ఇదిగో అని చెబుతున్నారు. అలా మాత్రమే చెబితే ఊరుకోగా..అందుకే ఎంత గొప్పగా రోడ్లు నిర్మిస్తామో చెప్పేందుకు ప్రయత్నించారు.
#WATCH | Jharkhand: I assure you that roads of Jamtara "will be smoother than cheeks of film actress Kangana Ranaut"; construction of 14 world-class roads will begin soon..: Dr Irfan Ansari, Congress MLA, Jamtara
— ANI (@ANI) January 15, 2022
(Source: Self-made video dated January 14) pic.twitter.com/MRpMYF5inW
తాము నిర్మించబోయే రోడ్లు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చెంపల కంటే సాఫీగా ఉంటాయని చెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక సెల్ఫీ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పైగా ఆ వీడియోలో సినీ నటి కంగనా రనౌత్ చెంపల కంటే రోడ్లు సున్నితంగా ఉంటాయని నేను మీకు హామీ ఇస్తున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పుడు దుమారం రేగుతోంది.
Also Read: యూపీ సీఎంగా తొలి ప్రాధాన్యత ఎవరికి?.. ABP- సీ ఓటర్ సర్వే ఫలితాలు ఇవే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి