International Womens Day 2022: యుద్ధ రంగంలో 'శివంగి'లా- ఎందరో మహిళలకు ఆదర్శంగా
మహిళా దినోత్సవం సందర్భంగా రఫేల్ ఫైటర్ జెట్ తొలి మహిళా పైలట్ శివాంగి సింగ్ గురించి తెలుసుకుందాం.
శివాంగి సింగ్.. రఫేల్ ఫైటర్ జెట్ తొలి మహిళా పైలట్ శివాంగి సింగ్. ఎంతోమంది యువతకు, మహిళలకు ఆదర్శంగా నిలిచిన ధీర వనిత ఆమె.
భారత 73వ గణతంత్ర వేడుకలో ఐఏఎఫ్ శకటం పరేడ్‌లో భాగమైన రెండో మహిళా ఫైటర్ జెట్ పైలట్‌గా శివాంగి రికార్డ్ సృష్టించారు. గతేడాది ఫ్లైట్ లెఫ్టినెంట్ భావనా కాంత్.. పరేడ్‌లో పాల్గొని ఆ ఘనత సాధించిన తొలి మహిళా ఫైటర్ జెట్ పైలట్‌గా నిలిచారు. ఇలా ఎన్నో ఘనతలు సాధించిన శివాంగి గురించి మహిళా దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం.
పరేడ్‌లో
భారత 73వ గణతంత్ర వేడుకలు ఇటీవల అట్టహాసంగా జరిగాయి. వాయుసేన విన్యాసాలు, శకటాల ప్రదర్శనతో పరేడ్ ఆకట్టుకుంది. దేశ సైనిక సామర్థ్యాన్ని చాటిచెప్పింది. పరేడ్‌లో సైన్యం, వాయుసేన, నావికాదళం, కేంద్ర పారాబలగాలు, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాలు భాగమయ్యాయి. పలు ఆయుధ వ్యవస్థలు, యుద్ధట్యాంకులు, క్షిపణులను సైన్యం ప్రదర్శించింది. అయితే ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.. రఫేల్ ఫైటర్ జెట్ తొలి మహిళా పైలట్ శివాంగి సింగ్. శివాంగి సింగ్.. భారత వాయుసేన శకటంతో పాటు కవాతులో పాల్గొన్నారు.
ఎవరీ శివాంగి..
- శివాంగి సింగ్.. వారణాసిలో ప్రాథమిక విద్యను అభ్యసించారు.
- బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు.
- 7 యూపీ ఎయిర్ స్క్వాడ్రన్‌లో ఎన్‌సీసీ క్యాడెట్‌గా శివాంగి ఉన్నారు.
- శివాంగి 2016లో ఐఏఎఫ్‌కి ఎంపికయ్యారు.
- 2017లో ఏర్పాటైన రెండో మహిళా ఫైటర్ పైలట్ల బృందంలో ఈమె ఓ సభ్యురాలు.
- హైదరాబాద్‌లో శిక్షణ పూర్తయ్యాక రాజస్థాన్ సరిహద్దులోని వైమానిక స్థావరంలో విధుల్లో చేరారు.
- ఇక్కడే వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ వద్ద శిక్షణ పొందే అవకాశం శివాంగికి దొరికింది.
- మిగ్-21ను నడపడంలో శివాంగి అసాధారణ ప్రతిభాపాటవాలను ప్రదర్శించడంతో రఫేల్ నడిపే అర్హతను ఆమె సాధించారు.
- రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలట్‌గా శివాంగి సింగ్ రికార్డ్ సృష్టించారు.
ఇలా ఎంతోమంది మహిళలు భారత దేశ ఖ్యాతిని దశదిశలా విస్తరించారు. వారి గురించి 'ఏబీపీ దేశం' యాప్‌లో తెలుసుకోండి
Also Read: Priyanka Narula: చింతకాయతో వరల్డ్ ఫేమస్, హైదరాబాద్ మహిళ వండర్‌ఫుల్ విక్కర్ స్టోరీ