Hyderabad: యాచకుడిగా మారిన ప్రభుత్వ ఉద్యోగి... రోడ్డుపైనే జీవనం రేకుల షెడ్డే నివాసం
మంచి చదువు చదివినా పొట్టకూటి కోసం ఓ చిన్న ప్రభుత్వ కొలువు తప్పలేదు. అనుకోకుండా జరిగినా రోడ్డు ప్రమాదంతో కాలుకు సర్జరీ అయ్యింది. ఆ సర్జరీ వల్ల ఉద్యోగం ఉడదీశారు అధికారులు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ అటెండర్ గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న నసీరుద్దీన్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలుకు సర్జరీ కావడంతో కొంతకాలంగా ఉద్యోగానికి వెళ్లలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న అధికారులు అతని ఉద్యోగం తొలగించారు. గత 18 నెలలుగా జీతం లేక జేబులో రూపాయి లేక రోడ్డుపైన ఒక రేకుల షెడ్డులో అనారోగ్యంతో బాధపడుతున్నారు. నా అనే వారు ఎవరూ లేకపోవడంతో కడుపు కాల్చుకుంటూ దొరికింది తింటూ జీవనం సాగిస్తున్నారు. తిరిగి విధుల్లోకి చేరడానికి నసీరుద్దీన్ ప్రయత్నం చేసిన అధికారులు రూ.40 వేలు లంచం డిమాండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.