TRS Leaders Protest | పాల ఉత్పత్తుల పై కేంద్రం జిఎస్టి వేయడంపై భగ్గుమన్న టిఆర్ఎస్ | ABP Desam
జీఎస్టీ రేట్ల పెంపుపై TRS తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించింది. పాలు, పాల అనుబంధ ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్లు నేతలు పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొన్న పార్టీ నేతలు , కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిత్య అవసరాలైన పాలపై కూడా జీఎస్టీ వేయడం సిగ్గుచేటని టీఆర్ ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒకవైపు పేద ప్రజలపై పెనుభారం వేస్తున్నా కేంద్రం మరోవైపు కార్పొరేట్ కంపెనీలను మరిన్ని కోట్లకు పడగలెత్తిన ఇలా చేస్తోందని నిరసనల్లో పాల్గొన్న నేతలు అన్నారు. వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడమే కాకుండా ఇప్పుడు రోజువారీ నిత్యావసరాల పై కూడా పడ్డారని జీఎస్టీ పేరుతో ఈ దోపిడీ ఎన్ని రోజులు కొనసాగిస్తారని వారు ప్రశ్నించారు.





















