Pocharam Dam Over Flowing | ప్రమాదపుటంచుల్లో పోచారం డ్యామ్..తీవ్ర స్థాయిలో వరద | ABP Desam
తెలంగాలో కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా ప్రఖ్యాత పోచారం డ్యామ్ పెను ముప్పులో ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణం ఫ్లడ్ ఓవర్ ఫ్లో. ఇప్పటికే పరిమితికి మించి ప్రమాదకర స్థాయిలో పోచారం డ్యామ్ కు చేరుకున్న నీరు దిగువకు ప్రవహిస్తుండగా...ఆ ఓవర్ ఫ్లో ఎక్కువయ్యి డ్యామ్ పక్క నుంచి కూడా వరద నీరు వెళ్లిపోతున్న దృశ్యాలు మనం విజువల్స్ లో చూడొచ్చు. వస్తున్న వరద ఉద్ధృతి చూస్తే ఇప్పట్లో తగ్గేలా కనిపించకపోవటం..రాత్రికి వరద ఉద్ధృతికి మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో ప్రాజెక్ట్కు గండి పడి వరద పరిసర గ్రామాలపైకి ముంచెత్తుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పరిసర గ్రామాలైన పోచారం, మాల్తూమ్, గోలిలింగాల, ఎంకంపల్లి, తాండూరు, పోచమ్మరాళ్, గాంధారిపల్లి, కురివాడ, ఆరేపల్లి గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రాజెక్టు కు కనిపిస్తున్న గండి కారణంగా ఊళ్లోకి వరద దూసుకువచ్చే అవకాశాలు ఉండటంతో ఈ రాత్రికి ఏం జరుగుతోందనే భయాందోళనలు నెలకొన్నాయి.





















