Nirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికి
నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ ఉపాధి కోసం కువైట్ దేశానికి వెళ్ళాడు. ఏజెంట్ మోసం వల్ల ఆయన ఎడారిలో ఒంటెలు మేపుకుంటూ ఇబ్బందులకు గురయ్యాడు. తనకున్న ఇబ్బందులను గత నెల రోజుల కిందట సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ పెట్టి తనను రక్షించాలి, స్వగ్రామానికి రప్పించాలని, కాపాడాలంటూ వేడుకోన్నాడు. దీనిపై ఏబిపీ దేశం సైతం ఓ కథనం ప్రసారం చేసింది. ఆయన కుటుంబ సభ్యులు ఆయనకున్న ఇబ్బందులను జిల్లా ఉన్నతాధికారులు స్థానిక ఎమ్మెల్యే ఇతరులతో కలిసి ప్రభుత్వానికి తెలిపారు. abp దేశంతో పాటు సోషల్ మీడియాలోను వచ్చిన కథనాలకు, కుటుంబ సభ్యులు సైతం ప్రభుత్వానికి తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టకేలకు కువైట్ దేశ రాయబారానికి సందేశం పంపి రాథోడ్ నాందేవ్ ను స్వ గ్రామానికి తిరిగి రప్పించారు. అయితే కువైట్ దేశంలో రాథోడ్ నాందేవ్ కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి..? ఆయన స్వగ్రామానికి రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు..? ఏజెంట్ మోసాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, ఏజెంట్ మోసాల గురించి ప్రజలకు ఆయన ఏం చెబుతున్నారు..? స్వగ్రామానికి రావడంతో ఎలా అనిపిస్తుంది. వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు..? ఈ అంశాలపై రాథోడ్ నాందేవ్ తో పాటు ఆయన తల్లి పూర్ణాబాయి, మరియు భార్య లక్ష్మీబాయి, లతో abp దేశం ఫేస్ టు ఫేస్.