KTR vs Revanth in Assembly Sessions | 52 సార్లు ఢిల్లీ వెళ్లి పీఎంని కలవకుండా సీఎం ఎందుకొచ్చారు?: కేటీఆర్
52 సార్లు ఢిల్లీ పోయిన సీఎం అక్కడ ప్రధాన మంత్రిని కలవకుండా తిరిగి రావడం ఏంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీలో ప్రశ్నించారు. తెలంగాణ సాధన కోసం ఢిల్లీ వెళ్లే సమయంలో కేసీఆర్ ఎలా పోరాడారో అందరికీ తెలుసని, తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్తున్నానని.. తిరిగి తెలంగాణలోనే అడుగుపెడతానని చెప్పి మరీ ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. తిరిగి తెలంగాణ సాధించుకున్న తర్వాతే తెలంగాణలో అడుగుపెట్టారని కేటీఆర్ అన్నారు. ‘మరి కేసీఆర్ సవాల్ చేసినట్లు బీసీ బిల్లు కోసం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఛాలెంజ్ చేయగలరా..? ఢిల్లీ వెళ్లి బీసీ బిల్లుకు ఆమోదం పొందే వరకు పోరాడగలరా?’ అని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెలలుగా చర్చల్లో ఉన్న బీసీ బిల్లు ఎట్టకేలకు ఆమోదం పొందింది. మంత్రి సీతక్క అసెంబ్లీలో ఈ బీసీ బిల్లును ప్రవేశ పెట్టగా.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాు కూడా మద్దతు వ్వడంతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. పంచాయతీల్లో రిజర్వేషన్‌పై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిచింది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో బీసీ బిల్లుతో పాటు పంచాయతీరాజ్ యాక్ట్ 285Aను సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో ఆమోదం పొందాయి.





















