KCR Emotional Maganti Gopinath | మాగంటి గోపీనాథ్ ను కడసారి చూసి కేసీఆర్ కన్నీళ్లు | ABP Desam
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ మృతి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిచివేసింది. మాగంటి గోపీనాథ్ కు పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన కేసీఆర్...ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ మాగంటితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మాగంటి గోపీనాథ్ కుమారుడిని దగ్గరకు పిలిచి హత్తుకున్నారు. ఆ తర్వాత మాగంటి గోపీనాథ్ కుటుంబసభ్యులకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. గోపీనాథ్ ఇంటి నుంచి జూబ్లీహిల్స్ స్మశాన వాటిక వరకూ బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఆయన అంతిమయాత్రను నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు చెరో వైపు నిలబడి మాగంటి గోపీనాథ్ పాడెను మోశారు. జూబ్లీహిల్స్ కు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ప్రజలకు నిత్యం చేరువలో ఉండే నేతగా పేరున్న మాగంటి గోపీనాథ్ ను కడసారి ఘనంగా పంపారు కేటీఆర్, హరీశ్ రావు. కేసీఆర్, కేటీఆర్ పక్కనే కూర్చునే లోకేశ్ మాగంటి గోపీనాథ్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. మాగంటి గోపీనాథ్ 35ఏళ్ల పాటు టీడీపీకి సేవలు అందించగా...ఏడేళ్లుగా బీఆర్ఎస్ లో ఉన్నారు. జూబ్లీహిల్స్ కు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు మాగంటి గోపీనాథ్ తో తమకున్న అనుంబధాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు.





















