అన్వేషించండి
పెద్దపల్లి జిల్లాలో 8 వందల ఏళ్ల నాటి మూషిక విగ్రహం.. తెలంగాణలో ఇదే పెద్దదట
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణానికి సమీపంలోని గోదావరి నది పక్కన జనగామ అనే గ్రామం ఉంది. ఇక్కడ కాకతీయుల కాలంనాటి త్రి లింగ రాజరాజేశ్వర స్వామి ఆలయం దగ్గరలో 8 వందల ఏళ్లనాటి అరుదైన మూషిక విగ్రహాన్ని చరిత్ర పరిశోధకులు కనుగొన్నారు. త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎదుట శిథిలావస్థలో ఉన్న త్రికూటాలయం వెనక పొదల మధ్య ఈ మూషిక విగ్రహం బయటపడింది. తెలంగాణలోనే అతి పెద్ద, అరుదైన మూషిక విగ్రహమని చరిత్రకారులు చెబుతున్నారు. గుప్త నిధుల కోసం ఈ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పెలికిలించి ఉంటారని అంటున్నారు.
వ్యూ మోర్





















