అయ్యప్ప దీక్ష తప్పా? స్కూల్ ప్రిన్సిపల్ ఘోర అవమానం!
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కోంపల్లి మునిసిపల్ పరిధిలో అయ్యప్ప మాల ధారణ విద్యార్థికి అవమానం ఎదురైంది. ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థి అయ్యప్ప స్వామి దీక్షలో ఉండగా.. స్కూల్ కి వస్తే ఆ విద్యార్థిని క్లాస్ రూంలో కాకుండా లైబ్రరీలో కూర్చోపెట్టి పరీక్ష రాయించారు. రేపటి నుంచి దీక్షా వస్త్రాలతో స్కూల్ కు రావద్దని ఢిల్లీ వరల్డ్ స్కూల్ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేశారు. ఆ విద్యార్థిని స్కూల్ బస్సులో స్కూల్ యాజమాన్యం ఇంటికి పంపించింది. ఆ తర్వాత ప్రిన్సిపల్ జాహ్నవి రెడ్డి విద్యార్థి తండ్రితో ఫోన్ మాట్లాడారు. ఈ ఫోన్ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అయ్యప్ప మాల ధారులు విద్యార్థికి, ఆయన తండ్రికి మద్దతుగా నిరసనలు చేశారు. న్యాయం కావాలంటూ వారు నినాదాలు చేశారు. ఈ విషయంలో పోలీసులు సైతం కలగజేసుకున్నారు. ప్రిన్సిపాల్, స్కూలు యాజమాన్యం కూడా బయటికి వచ్చి వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో ఏబీవీపీ నేతలు కూడా వచ్చి స్కూలు తీరును తప్పుబడుతూ నిరసనలు చేశారు.