Hyderabad Heavy Rains Floods: హాస్టల్ విద్యార్థులను జేసీబీలో తరలించిన అధికారులు
హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు మేడ్చల్ మండల పరిధిలోని వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. మైసమ్మగూడ ప్రాంతంలో చాలా హాస్టళ్లు ఉన్నాయి. భారీగా వరదనీరు ఈ ప్రాంతంలోకి రావటంతో..... అక్కడ పెద్దఎత్తున నీరు నిలిచిపోయింది. ఓ హాస్టల్ భవనంలో విద్యార్థులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. చాలా మంది విద్యార్థినులు తమ ఏరియాలో పరిస్థితిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొందరైతే.... ఇందులో సరదా యాంగిల్ కూడా చూశారు. ఇక్కడ కాలేజ్ ఉండాలి కదరా... ఏదీ అన్నట్టుగా.... నీటమునిగిన కాలేజ్ వీడియో తీసి పోస్ట్ చేశారు. హాస్టల్ లో విద్యార్థినులు చిక్కుకున్నారని తెలుసుకున్న మున్సిపల్ సిబ్బంది.... జేసీబీ, ట్రాక్టర్ తో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.





















