అన్వేషించండి
Hyderabad Heavy Rains: మరోసారి భాగ్యనగరంలో వానల బాదుడు
హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. నగరానికి నలువైపులా ఆగకుండా కురిసిన కుంభవృష్టికి అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు ఇబ్బందులుపడ్డారు. అన్ని కీలక కూడళ్లల్లోనూ వాహనాలు భారీగా బారులు తీరాయి. ట్రాఫిక్ చాలా స్లోగా కదులుతోంది. అదే సమయంలో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
వ్యూ మోర్





















