Farmers Protest Against Ethanol Industry | ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై రైతుల ఆందోళన | ABP Desam
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంపెద్ద ధన్వాడ గ్రామంలో ప్రజల నిరసనతో గందరగోళంగా మారింది. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 12 గ్రామాల ప్రజలు ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది. ప్రభుత్వం పనులు ఆపేస్తున్నామని హామీ ఇచ్చినప్పటికీ కూడా యాజమాన్యం నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రయత్నించడంతో ప్రజలు వాహనాలను ధ్వసం చేశారు. టెంట్లు, కంటెయినర్లకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసులు మోహరించినప్పటికీ కూడా అడ్డికోలేకపొయ్యారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన టెంట్లను, కంటైనర్ హౌస్‌ని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. బొలేరో ట్రక్కును తిరగేసేశారు. చాలా సమయం తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఈ 12 గ్రామాల ప్రజలు ఆరోగ్యానికి, వ్యవసాయానికి హానికరమని వ్యతిరేకిస్తున్నారు. ఈ కంపెనీకి సంబంధించి ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయానికి రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘర్షణల కారణంగా గ్రామమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.





















