Vaibhav Suryavanshi Angry vs KKR IPL 2026 | వైరల్ అవుతున్న వైభవ్ ఔట్
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్ పవర్‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 28 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసి హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు.
హాఫ్ సెంచరీ మిస్ అవడంతో వైభవ్ చాలా డిస్సపాయింట్ అయ్యాడు. పెవిలియన్ కు వెళ్తున్నప్పుడు తన షాట్ సెలెక్షన్‌పై కోపంతో బ్యాట్‌ను గట్టిగా నేలకు కొట్టాడు. ఇందుకు సంబందించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. యశస్వి జైస్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు వైభవ్. తన దూకుడు చూసి ప్రత్యర్థి బౌలర్లు సైతం అవాక్కయ్యారు.
ఇక ఈ మ్యాచ్ తో వరుస ఓటములు చెక్ పెట్టింది కోల్కతా నైట్ రైడర్స్. వరుసగా ఓటములను ఎదుర్కుటూ ఫ్యాన్స్ నుంచి ఎన్నో విమర్శలు అందుకుంది. కానీ వరుసగా వికెట్స్ పడి కష్టాలో ఉన్న కోల్కతాను విజయం వైపు నడిపించాడు ఫినిషర్ రింకు సింగ్.
ట్రెండింగ్ వార్తలు






















